దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జనవరి 3న అనుమతిచ్చింది. క్రమంగా దేశంలో అందరికీ కొవిడ్ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను ఎలా పొందాలా? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కొవిన్) యాప్‌ను రూపొందించింది.
కో-విన్‌తో కొవిడ్ వ్యాక్సిన్ పొందడమెలా?
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇదివరకే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను పొందాలనుకునేవారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కొవిన్) యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మరి ఈ యాప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందామా?
కొవిడ్ వ్యాక్సిన్ పొందడమెలా?
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఆ యాప్.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అందులో రిజిస్టర్ చేసుకునే వారికే వ్యాక్సిన్‌ను అందిస్తారు.
ఇదీ చదవండి :'వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేయడం కఠిన సవాల్'