తెలంగాణ

telangana

మీ ఫేస్​ కట్​కు - ఎలాంటి బొట్టు బాగుంటుందో తెలియట్లేదా?

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 12:50 PM IST

How to Find Perfect Bindi For Your Face Shape : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫ్యాషన్ వెంట పరుగులు తీస్తోంది. ఇంట్లోనుంచి అడుగు బయటపెట్టాలంటే.. చక్కగా ముస్తాబవ్వాల్సిందే! ఈ విషయానికి మహిళలు ఎంత ప్రయారిటీ ఇస్తారో తెలిసిందే. అయితే.. టాప్​ టూ బాటమ్ ట్రెండీగా రెడీ అయినా.. నుదుట ఎలాంటి స్టిక్కర్ పెట్టుకోవాలో చాలా మందికి తెలియదు. మరి.. మీకు తెలుసా..?

Bindi
How to find perfect bindi for your face shape

How to Find Perfect Bindi For Your Face Shape :నుదుట కుంకుమ పెట్టుకోవడం అనేది పాత పద్ధతి. ఒక వయసు వచ్చిన వారు తప్ప.. ఇప్పుడంతా స్టిక్కర్సే వాడుతున్నారు. దీంతో.. మార్కెట్​లో రకరకాల బిందీలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి. ముఖాన్ని మరింతగా వెలిగించడంలో స్టిక్కర్స్​ ఎంతో ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే.. చాలా మంది వారికి నచ్చినవి కొనుగోలు చేస్తున్నారు తప్ప.. సరిపడేవి కొనలేకపోతున్నారు. కంటికి నచ్చిన ప్రతిదీ.. ఒంటికి నప్పదు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి.. మీకు సూటయ్యే స్టిక్కర్​ను ఎలా సెలక్ట్​ చేసుకోవాలో మీకు తెలుసా..? ఆ వివరాలు ఇక్కడ తెలుకోండి.

రౌండ్ ఫేస్ ఉన్నవారు :మీ ముఖం గుండ్రంగా ఉన్నవారికి రౌండ్ షేప్ బిందీలు అంతగా సూట్​ కావు. చక్కగా పొడుగ్గా ఉంటే స్టిక్కర్స్​ని ఎంచుకోండి. దీని వల్ల మీ లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. అందంగా కనిపిస్తారు.

డైమండ్ షేప్ ఉన్నవారు :ముఖం ఈ షేప్​లో ఉన్నవారికి నుదురు చిన్నగా ఉంటుంది. గడ్డం, ముఖాకృతి చక్కగా ఉంటుంది. కాబట్టి వీరు మరీ ఎక్కువగా డిజైన్స్ ఉండే స్టిక్కర్స్ కాకుండా సింపుల్​గా ఉండే బిందీలు సెలెక్ట్ చేసుకోవడం మంచిది.

ట్రెండీగా కనిపించాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

చతురస్రాకారం షేప్ ఉన్నవారు :ఈ ఫేస్ షేప్ ఉన్నవారు కూడా అన్ని డిజైన్స్ స్టిక్కర్స్ కాకుండా హైలైట్​గా ఉండే రౌండ్ స్టిక్కర్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. చంద్రుని ఆకారంలో ఉన్న బిందీలు కూడా వీరికి బాగుంటాయి.

ఓవల్ షేప్ ఉన్నవారు : ఓవల్ షేప్ ముఖం ఉన్నవారికి నుదురు, గడ్డం పొడుగ్గా ఉంటాయి. కాబట్టి వీరు గుండ్రంగా ఉండే ఎలాంటి బిందీలనైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ టైప్​ స్టిక్కర్స్ వీరి ఫేస్​కి సరిగ్గా సెట్ అవుతాయి.

హార్ట్ షేప్ ఉన్నవారు :ఈ షేప్ ఫేస్ ఉన్న వారికి నుదురు, గడ్డం చదునుగా ఉంటుంది. వీరు గుండ్రంగా ఉన్నవాటితోపాటు కొంచెం పొడుగ్గా ఉన్న స్టిక్కర్స్ పెట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.

ఇలా ట్రై చేయండి..

  • మ్యాచింగ్ బిందీ పెట్టుకోవడం అనేది ఇంతకు ముందు ఫ్యాషన్. అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు వేసుకునే డ్రెస్‌లో ఏదైనా చిన్న మ్యాచింగ్ ఉన్న కలర్ స్టిక్కర్ పెట్టుకోవడం ద్వారా.. మీ బిందీ డ్రెస్ కలర్​తో ఎలివేట్ అవుతుంది.
  • మీరు ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కొత్త స్టిక్కర్స్ ట్రై చేస్తూ ఉండండి. దీనివల్ల.. ఎలాంటివి మీకు సూట్ అవుతాయనే విషయం మీకే అర్థమవుతుంది.
  • స్టిక్కర్స్ క్వాలిటీ ఉన్నవి తీసుకోకపోతే.. త్వరగా ఊడిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. స్టిక్కర్ అంటించే ప్రాంతంలో కాస్త పౌడర్ రాయండి. దీనివల్ల తొందరగా ఊడిపోకుండా ఉంటాయి.
  • ఈసారి నుంచి ఈ పద్ధతులు పాటించండి.. తప్పకుండా మీరు కొత్తగా ఫీలవుతారు.

నుదుటి మీద ముడతలా..? ఈ చిట్కాలు పాటించండి!

How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్​ పాటిస్తే చాలు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details