తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునే వారి కోసం వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. దాని కోసం ఏం చేయాలంటే?

nearest-vaccination-centre-on-whatsapp
వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌

By

Published : May 4, 2021, 10:35 PM IST

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. దాని కోసం ఏం చేయాలంటే?

💉 తొలుత మీ స్మార్ట్‌ ఫోన్‌లో +919013151515 నెంబరును సేవ్‌ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి మీరు సేవ్‌ చేసిన పేరుతో నెంబరును వెతకండి.

💉 సెర్చ్‌లో వచ్చిన నెంబరుకు Namaste అని మెసేజ్‌ పంపండి. (నమస్తే అనే కాదు, ఇంగ్లిష్‌లో ఏ పదం మెసేజ్‌గా పంపినా ఓకే) వెంటనే MyGov Corona Helpdeskకు సంబంధించిన బాట్‌ యాక్టివ్‌ అవుతుంది.

వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

💉 అప్పుడు మీకు పై మెసేజ్‌ వస్తుంది. అందుంలోంచి మీకు కావాల్సిన నెంబరును ఎంచుకొని తిరిగి పంపాలి. ఉదాహరణకు మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు కావాలంటే ‘1’ అని రిప్లై ఇవ్వాలి.

💉 ఆ తర్వాత కొవిడ్‌ సెంటర్స్‌ సమాచారం కోసం ‘1’ అని రిప్లై ఇవ్వమని అడుగుతుంది. మీరు అలా రిప్లై ఇవ్వగానే మీ పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయమని అడుగుతుంది.

💉 ఆరు అంకెల పిన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత.. కొంచెం సమయం తీసుకొని ఆ పిన్‌ కోడ్‌కు దగ్గరలో ఉన్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు, అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ స్లాట్స్‌ అవైలబిటీ వివరాలు తెలియజే స్తుంది.

వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

💉 వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలతోపాటు వ్యాక్సినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్‌ కూడా వస్తుంది.

💉 ముందుగా చెప్పుకున్నట్లు ఈ బాట్‌లో వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు మాత్రమే కాకుండా కరోనా అప్‌డేట్స్‌, సక్సెస్‌ స్టోరీస్‌, ఫాక్ట్‌ చెక్‌, కరోనా లక్షణాలు లాంటి మరిన్ని వివరాలు కూడా వస్తాయి. దీని కోసం మరోసారి Namaste అనో లేక Hello అనో ఏదో ఒకటి పంపిస్తే మీకు లిస్ట్‌ వస్తుంది. అందులోంచి మీకు కావాల్సిన నెంబరు ఎంచుకొని రిప్లై ఇస్తే ఆ సమాచారం వస్తుంది.

💉 అయితే ఈ బాట్‌ ఆంగ్లంలో మాత్రమే పని చేస్తుంది. తెలుగులో ఏ మెసేజ్‌ పెట్టినా బాట్‌ స్పందించదు. నా స్థాయికి మించి సమాచారం అడిగారు అని సమాధానం వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details