Find Blood Banks in Online: కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం.. రక్తం కావాలని అడిగే వారిని గమనిస్తూనే ఉంటాం. ఆస్పత్రి కారిడార్‌లో రక్తం కోసం ఆందోళన పడుతూ తిరిగే రోగి సంబంధీకులను చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి అరుదైన బ్లడ్ గ్రూపులు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అనుకోకుండా తలెత్తే అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు రక్తం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఎవరిని సంప్రదించాలి? అనే విషయం గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వారు.. ఆన్లైన్లో ఎలా బ్లడ్ సేకరించాలో ఈ స్టోరీలో చూద్దాం.
సాధారణంగా పేటీఎం లో బిల్లులు పే చేయడం, మనీ ట్రాన్స్ఫర్, లోన్స్ తీసుకోవడం, టికెట్ బుకింగ్, ఇన్సూరెన్స్, గేమ్స్ ఆడుకోవడం లాంటి ఫీచర్ల గురించి అందరికీ తెలుసు. అయితే.. ఇదే పేటీఎం ను ఉపయోగించి.. ఏయే బ్లడ్ బ్యాంకుల్లో.. ఎంత మోతాదులో బ్లడ్ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా మెడిసిన్స్ ఆర్డర్ చేయడం, ల్యాబ్ పరీక్షలను బుకింగ్ చేయడం, వ్యాక్సిన్ బుకింగ్ పబ్లిక్ హెల్త్ యాప్‌లను యాక్సెస్ చేయడం వంటి అనేక రకాల ఆరోగ్య సంబంధిత సేవల గురించి తెలుసుకోవచ్చు.
పేటీఎం ఉపయోగించి బ్లడ్ బ్యాంకులకు కనెక్ట్ అవ్వడం ఎలానో ఇప్పుడు చూద్దాం..
How to Connect to Blood Banks Through Paytm:
- ముందుగా మీ ఫోన్లో Paytm App ఓపెన్ చేయండి.
- యాప్‌ను కిందకు స్క్రోల్ చేసి.. Do More With Paytm ఆప్షన్లో Paytm Health బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత Public Health Appsలో Blood Bank ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అనంతరం సిటీ, బ్లడ్ గ్రూప్, బ్లడ్ కాంపోనెంట్‌ను సెలెక్ట్ చేసుకుని Find Availability ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు ఎంచుకున్న బ్లడ్ గ్రూప్‌కు సంబంధించిన వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- అంతే కాకుండా మరింత సమాచారం కోసం బ్లడ్ బ్యాంక్‌కు కాల్ చేయడం లేదా మెయిల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా సదరు బ్లడ్ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
- అలాగే ‘షేర్’ బటన్‌ను నొక్కడం ద్వారా ఈ వివరాలను ఇతరులకు కూడా పంపవచ్చు.
e Raktkosh వెబ్సైట్ ద్వారా కూడా..
- ఈ లింక్ ద్వారా https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html సెర్చ్ చేయండి.
- పేజ్‌ను కిందకు స్క్రోల్ చేసి.. Blood Availability ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత State, District సెలెక్ట్ చేసి Search ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మీరు సెలెక్ట్ చేసిన జిల్లాలో ఉన్న బ్లడ్ బ్యాంకు వివరాలు, ఆ బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- అంతే కాకుండా మరింత సమాచారం కోసం బ్లడ్ బ్యాంక్‌కు కాల్ చేయడం లేదా మెయిల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా సదరు బ్లడ్ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.