How to Download BSNL Employees Payslip: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలోని టెలీకమ్యూనికేషన్ కంపెనీ. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో.. వివిధ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంస్థ కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే ఉద్యోగులకు పే స్లిప్ జారీచేస్తోంది. మరి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలుసా..?
పే స్లిప్ అంటే ఏంటి?
What is a BSNL Employee Salary Slip?: పే స్లిప్ అనేది ఒక ఉద్యోగికి ఇచ్చిన వేతనం గురించిన వివరాలను అందించే పత్రం. ఇందులో.. వారి ప్రాథమిక జీతం నుంచి.. అలవెన్సులు, తగ్గింపులు, ఇతర వివరాల వరకూ ప్రతీ సమాచారం ఉంటుంది.
Cheapest Prepaid Plans : బెస్ట్ ఇయర్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ .. అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా!
BSNL ఎంప్లాయీ పే స్లిప్ 2023 డౌన్‌లోడ్ చేసే విధానం..
How to Download BSNL Employee Payslip 2023: BSNL ఉద్యోగులు తమ పే స్లిప్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
- BSNL ఉద్యోగులు.. https://erpportal.bsnl.co.in/irj/portal/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి..
- ఇప్పుడు.. మీ User ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి లాగిన్ కావాలి.
- తర్వాత HR ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత పే స్లిప్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న నెల, సంవత్సరాన్ని ఎంచుకోండి.
- డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి. పే స్లిప్ డౌన్‌లోడ్ అవుతుంది.
BSNL పే స్లిప్ ఎలా పరిశీలించాలి?
How to Read BSNL Payslip?:
ఉద్యోగి పే స్లిప్‌లో రెండు ముఖ్యమైన గణాంకాలు ఉంటాయి. స్థూల జీతం(Gross Salary ), నికర జీతం(Net Salary). స్థూల జీతం అనేది ఉద్యోగి సంపాదించే మొత్తం. ఇందులో ప్రాథమిక జీతం, అలవెన్సులు, ఇతర చెల్లింపులు ఉంటాయి. కోతలు (Deductions) పోగా మిగిలిన వేతనాన్ని నికర జీతం అంటారు. డిడక్షన్స్ లో.. ప్రావిడెంట్ ఫండ్, పన్నులు, ఇతర చెల్లింపులు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.