How to Download Ayushman Bharat Card in Telugu : ఆర్థికంగా వెనకబడిన నిరుపేద కుటుంబాలకు మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన'(PMJAY)అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్నే "ఆయుష్మాన్ భారత్ యోజన" అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా ఇది నిలిచింది. కేంద్రం పీఎంజేఏవై పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించింది.
How to Download Pradhan Mantri Jan Arogya Yojana Card :ఈ పథకం ద్వారా అర్హులైన ఒక్కో కుటుంబానికి కేంద్రం ప్రతి ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనైనా.. ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు పొందవచ్చు. ఇటీవలే కేంద్రం ఈ పథకం కింద ఈ-కార్డులు(ఆయుష్మాన్ భారత్ కార్డు) జారీ చేస్తోంది. మరి.. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ తర్వాత ఏ విధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మొదట మీరు పీఎంజేఏవై వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ఓపెన్ చేసి 'Am I Eligible' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నంబర్ టైప్ చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
- ఆపై 'Generate OTP' అనే దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని టైప్ చేయాలి.
- అనంతరం మీ రాష్ట్రం, జిల్లాను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబర్‌ను సెర్చ్ చేయాలి.
- అప్పుడు సెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా ఈ పథకం కింద మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.
- ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నంబరు 14555 లేదా 1800-111-565కి ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
Pradhan Mantri Jan Aushadhi : దేశంలో 10,500 ప్రభుత్వ మందుల దుకాణాలు.. సామాన్యులకు చాలా చౌకగా..
ఆయుష్మాన్ భారత్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమెలా..?
How to Download an Ayushman Bharat Card in Online :
- మీరు మొదట ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్ 'pmjay.gov.in'ని సందర్శించాలి.
- అనంతరం హోం పేజీలో 'Menu' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత పోర్టల్స్ విభాగం కింద 'Beneficiary Identification System' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత 'Download Ayushman Card' అనే దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో 'Aadhaar' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత 'Scheme, State, Aadhaar Number' వివరాలను అక్కడ అడిగిన బాక్స్‌లలో నమోదు చేయాలి.
- ఆపై డిక్లరేషన్ చదివి అక్కడ ఉన్న బాక్స్‌లో టిక్ చేయాలి. అనంతరం 'Generate OTP'పై నొక్కాలి.
- అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది.. దానిని నమోదు చేసి 'Verify' అనే దానిపై క్లిక్ చేయాలి.
- చివరగా వెరిఫికేషన్ అయిపోయాక.. 'Ayushman Card Download' అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఆయుష్మాన్ భారత్ కార్డు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.