Silver Items Cleaning Tips:బంగారం తర్వాత ఎక్కువ డిమాండ్ ఉన్నది వెండికే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ వెండి వస్తువులు ఉంటాయి. కాళ్ల పట్టీల నుంచి దేవుడి విగ్రహాల వరకు చాలా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. అందంగా, ప్రకాశవంతంగా కనిపించే వెండి వస్తువులు కొన్ని రోజుల తర్వాత నల్లగా మారుతాయి. దానికి కారణం.. వెండి నగలపై ఉండే ఆక్సైడ్ పూత. ఇది గాలి తగలడం వల్ల క్రమంగా మెరుపు తగ్గిపోతుంది.. దీంతో కొన్నాళ్లకు వస్తువులు నల్లగా మారుతాయి. అయితే.. ఈ టిప్స్ ఫాలో అయ్యి.. వెండి వస్తువులను మెరిసేలా చేయండి.
ఈ క్లీనర్‌తో - మీ బాత్ రూమ్ తళతళా మెరిసిపోద్ది!
బేకింగ్ సోడా:చాలామంది బేకింగ్ సోడాను వివిధ లోహాలతో కూడిన వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు. అయితే దీనిని వినియోగించి వెండి వస్తువులను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీనిని వినియోగించడానికి ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసుకొని బేకింగ్ సోడాను కలపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులపై అప్లై చేసి మెత్తని బ్రష్‌తో స్మూత్‌గా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాల పాటు రుద్దిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుని పొడి క్లాత్‌తో తుడుచుకుంటే వెండి ఆభరణాలు మెరుస్తాయి.
పిల్లలు వైట్ సాక్స్ నల్లగా మార్చేస్తున్నారా? - ఈ చిట్కాలతో కొత్త వాటిలా!
బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్: బేకింగ్ సోడా వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేస్తుంది. దీని కోసం బేకింగ్ సోడాను పేస్ట్‌లాగా చేసుకుని ఆ ఆభరణాన్ని అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టండి. మీ వస్తువుల రంగు బట్టి 3 సెకన్ల నుంచి 3 నిమిషాల వరకు ఫాయిల్ చుట్టి ఉంచొచ్చు. తర్వాత క్లీన్ చేసుకుంటే సరి..