తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Check Train PNR Status : మీకు తెలుసా..? ట్రైన్ PNR స్టేటస్ సింపుల్​గా చెక్ చేసుకోవచ్చు! - ఇండియన్ రైల్వేస్ తాజా వార్తలు

How to get Train PNR Status in Online : మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? టికెట్ కన్ఫామ్ అయిందా.. లేదా..? అనే విషయం తెలుసుకునేందుకు.. పదేపదే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేయాల్సి వస్తోందా? ఇప్పుడు మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు..!

Train
Train PNR Status

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 9:39 AM IST

How to find Train PNR Status in Online : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ట్రైన్ జర్నీని ఆశ్రయిస్తుంటారన్న విషయం తెలిసిందే. అలాంటి వారు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రయాణికులు కొన్ని రోజులు లేదా నెలల ముందుగానే.. వారి ట్రైన్ టికెట్లు(Train Tickets)బుక్ చేసుకుంటుంటారు. అందువల్ల చివరి దశలో ప్రయాణం చేయాల్సిన వారికి టికెట్లు దొరకవు. అయినప్పటికీ.. వెయిటింగ్ లిస్టులో ప్రయత్నిస్తారు. కానీ.. ఎప్పుడు కన్ఫామ్ అవుతాయో.. అసలు టికెట్లు దక్కుతాయో లేదో అనే టెన్షన్ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు.. తరచూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు.

Train PNR Status Check Online : సాధారణంగా మనం టికెట్ బుక్​ చేసుకున్న సమయంలో దానిపై పీఎన్ఆర్​ నంబర్ వస్తుంది. చాలా మంది పీఎన్​ఆర్​ను బట్టి వారి టికెట్ స్టేటస్​ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ పీఎన్​ఆర్ స్టేటస్ చెక్ చేయడం అంత ఈజీగా ఉండదు. దాంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. ఇప్పుడు గతంలో మాదిరిగా అంత కష్ట పడాల్సిన అవసరం లేదు. ఆన్​లైన్​లో లేదా ఆఫ్​లైన్​లో సింపుల్​గా మీ PNR STATUS చెక్ చేసుకోవచ్చు.

పీఎన్​ఆర్ స్టేటస్ అంటే ఏమిటి..?

What is Train PNR Status :పీఎన్​ఆర్అంటే Passenger Name Record(PNR) అని అర్థం. ఇది రైలు టికెట్లను బుక్ చేసుకునే ప్రతి ప్రయాణికుడికి 10 అంకెలతో కేటాయించే ప్రత్యేక సంఖ్య. రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ పత్రం మధ్యలో లేదా దిగువన ఈ PNR నంబర్ కనిపిస్తుంది. ఈ పీఎన్​ఆర్ స్టేటస్ చెక్​ చేసుకోవడం ద్వారా మీ ట్రైన్ టికెట్ బుక్ అయిందా? లేదా? మీకు కేటాయించిన బెర్తు, సీటు నంబర్, ప్రయాణించే తేదీ, రైలు బుకింగ్ స్థితి (వెయిట్‌లిస్ట్, కన్ఫర్మ్, RAC) ఇలా మొదలైన వాటి గురించి కచ్చితమైన వివరాలన్ని సమగ్రంగా తెలుసుకోవచ్చు.

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

Methods to Check Train PNR Status :

పీఎన్​ఆర్ స్టేటస్​ను చెక్​చేసుకునే పద్ధతులివే :

  • రిజిస్ట్రేషన్ తర్వాత అధికారిక IRCTC వెబ్‌సైట్ నుంచి రైలు టికెట్ PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
  • రైల్వే విచారణ కౌంటర్ల ద్వారా ఈ స్టేటస్ తెలుసుకోవచ్చు
  • IRCTC మొబైల్ అప్లికేషన్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
  • రైల్వే రిజర్వేషన్ చార్ట్ నుంచి దీనిని చెక్​ చేసుకోవచ్చు.

How to Check Train PNR Status in Online Telugu :

ఆన్​లైన్​లో ట్రైన్ PNR స్టేటల్ ఎలా చెక్ చేసుకోవాలి..?

  • మొదట మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం లాగిన్ పేజీకి వెళ్లాలి.
  • ఆ తర్వాత మీ పేరు, పాస్​వర్డ్, CAPTCHA కోడ్‌ని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
  • మీకు ఐఆర్​సీటీసీలో అకౌంట్ లేకున్నా.. లాగిన్ అవ్వకుండా థర్డ్ పార్టీ వెబ్​సైట్​ని ఉపయోగించి మీ పీఎన్​ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • ముందుగా మీరు ఇప్పుడు IRCTC వెబ్‌సైట్‌లో మెను బార్‌లోని Train ట్యాబ్​పై క్లిక్ చేసి.. PNR ఎంక్వైరీని ఎంచుకోవాలి. కొత్త PNR స్టేటస్ చెకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు అవసరమైన బాక్స్​లో మీ 10 అంకెల ట్రైన్ పీఎన్​ఆర్ నంబర్​ను ఎంటర్ చేసి.. 'Get Status' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అంతే కంప్యూటర్​ స్క్రీన్​పై మీ రైలు PNR స్టేటస్ కనిపిస్తోంది.

నాలుగేళ్ల పిల్లలకూ ట్రైన్​లో ఫుల్​ టికెట్ తప్పదా, రూల్స్ ఇలా ఉన్నాయట

అయితే.. మీ స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ లేదా ఆఫ్​లైన్​లో పీఎన్ఆర్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా? అలా కూడా మీ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు ఇండియన్ రైల్వేస్(Indian Railways) కల్పించింది. అది ఎలాగో చూడండి.

ఆఫ్​లైన్​లో ట్రైన్ PNR స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

How to Check Train PNR Status in Offline :మీరు ఆన్​లైన్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ పొందకపోతే సింపుల్​గా మీ మొబైల్​ ఫోన్ ద్వారా ఆఫ్​లైన్​లో తెలుసుకోవచ్చు. ముందుగా ఎస్​ఎంఎస్ ద్వారా పీఎన్​ఆర్ స్టేటస్ ఎలా పొందవచ్చు అంటే..

SMS ద్వారా ట్రైన్ PNR స్టేటస్ :మీ మొబైల్​లో PNR అని టైప్ చేసి ఆ తర్వాత మీ 10 అంకెల సంఖ్యను నమోదు చేసి 5676747, 139, 57886, 5888 అనే నంబర్​లకు SMS చేయండి. కాసేపటికి మీకు మీ పీఎన్​ఆర్ స్టేటస్ వస్తోంది.

ఫోన్ కాల్స్ ద్వారా మీ రైలు PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు :మొదట మీరు మీ మొబైల్ ద్వారా 139కి కాల్ చేయాలి. అలాగే IVR ఇచ్చే అన్ని సూచనలను అనుసరించాలి. అదేవిధంగా మీరు కాల్ చేయడానికి ముందు మీ నగరం STD కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా ఆఫ్​లైన్​లో మీ ట్రైన్ పీఎన్​ఆర్ స్టేటస్ సింపుల్​గా తెలుసుకోవచ్చు.

South Central Railway Economy Meals : రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ఈ స్టేషన్లలో రూ.50కే భోజనం

Railway jobs 2023 : రైల్వేలో 790 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details