How to Check Status of TS e-Challans Online : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... ట్రాఫిక్ రూల్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటేనే.. సిగ్నల్ జంపింగ్ దొంగలు దొరికేవారు. కానీ.. ఇప్పుడు మూడో కన్ను(CC Cameras) వారిపై నిఘా వేస్తోంది. సీసీ కెమెరాల ద్వారా.. తప్పుడు దారిలో వెళ్తున్న వారికి కళ్లెం వేసే చర్యలు చేపట్టారు. దీని ప్రకారం.. ఎవరు సిగ్నల్ ను ఉల్లంఘించినా.. ఫైన్ తప్పదు. ఆ విషయం మనకు ఇంటికి లెటర్ వచ్చేదాకా తెలియదు. మరి, మీ వాహనంపై ఇప్పటిదాకా ఎన్ని చలాన్లు ఉన్నాయో ముందే తెలుసుకుంటే ఏం చేయాలో తెలుసా..?
Check Status of TS e-Challans Online : మనం నిత్యం రోడ్డుపై ఎంతో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తున్నా.. ఒక్కోసారి అత్యవసర సమయంలో "గీత" దాటేస్తాం. ఆ టైమ్లో మనల్ని ఎవ్వరూ చూడలేదు అనుకుంటాం. కానీ.. మన వ్యవహారం రికార్డైపోయి ఉంటుంది. మరి, ఈ లెక్కన ఇప్పటి వరకూ మీ బైక్ పై ఎన్ని చలాన్లు ఉన్నాయో మీకు తెలుసా.. ఒక్కసారి ఆన్లైన్లో సింపుల్గా ఇ-చలాన్ల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వాహనాల మీద ఏవైనా చలాన్లు(E Challans)ఉంటే.. వెంటనే చెల్లించండి. దీనికోసం.. ఈ పద్ధతిని అనుసరించండి..
పరివాహన్ పోర్టల్ ద్వారా..
TS e-Challan On Parivahan Portal :
- మొదట మీరు ఇ-చలాన్ వెబ్సైట్ parivahan.gov.inని సందర్శించాలి.
- అనంతరం లాగిన్ అయ్యాక Check Online Services పై క్లిక్ చేసి.. 'Check Challan Status' అనే ఆప్షన్పై నొక్కాలి.
- అప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్/వాహనం నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
- మీరు వాహనం నంబర్ ద్వారా తెలుసుకోవాలంటే మీ వెహికిల్ ఛాసిస్ లేదా ఇంజిన్ నంబర్నూ టైప్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత మీ వాహనంపై జరిమానా లేకపోతే చలాన్ కనుగొనబడలేదని వస్తుంది.
- ఒకవేళ మీ వెహికిల్పై ఇ-చలాన్ జారీ చేసి ఉంటే చలాన్ గురించి అన్ని వివరాలను మీకు చూపుతూ ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ విధంగా సింపుల్గా మీరు ఆన్లైన్లో ఇ-చలాన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
- ఇక వాహనంపై స్టేటస్ చెక్ చేసుకున్నాక చాలా మంది వాటిని ఎక్కడ చెల్లించాలనే సందేహంలో ఉంటారు. ఇప్పుడు గతంలో మాదిరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటు నుంచే మీ మొబైల్లో చాలా సులభంగా మీ వెహికిల్పై ఉన్న ఇ-చలాన్లు చెల్లించవచ్చు. వాటికోసం ఇక్కడ కొన్ని పద్ధతులు మీకు తెలియజేస్తున్నాం..
అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటారో ఇక అంతే..