How to Apply Passport in Online :ప్రపంచంలో ఎవరైనా విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకువెళ్లాలనుకుంటే కచ్చితంగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉండాల్సిందే. పాస్‌పోర్టు అనేది సదరు వ్యక్తి ఏ దేశానికి చెందినవాడో తెలుపుతుంది. ఈ క్రమంలో భారతీయులు ఉన్నతవిద్య, వ్యాపారం కోసం విదేశాలకు ప్రయాణించడానికి తప్పనిసరిగా మన దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. కనుక విదేశాలకు వెళ్లేముందుపాస్పోర్టు(Indian Passport) రావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని దీనికి అప్లై చేసుకోవాలి. గతంలో పాస్‌పోర్టు జారీకి బాగా సమయం పట్టేది. ఈ గడువును తగ్గించడం కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎంపాస్‌పోర్ట్ పోలీస్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
How to Check Passport Status in Telugu :మొదట పాస్‌పోర్టు కోసం దరఖాస్తు(How to Apply Passport in Telugu) చేసే ముందు అందుకు కావాల్సిన పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకుని ఈ ఎంపాస్‌పోర్ట్ పోలీస్ యాప్ ఓపెన్ చేసి అడిగిన వివరాలన్నీ సబ్మిట్ చేయాలి. అనంతరం పాస్‌పోర్టు కోసం ఆన్లైన్లో రూ.1500 చెల్లించాలి. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పాస్‌పోర్టు జారీకి ఈ యాప్ రాకముందు పోలీస్ వెరిఫికేషన్ కోసమే సగం సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ఎంపాస్‌పోర్ట్ పోలీస్ యాప్(Mpassport Police App)తో ఆ గడువు చాలా వరకు తగ్గింది. అదేవిధంగా పాస్‌పోర్టు జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం కేంద్రం పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేంద్రాలను డిజీలాకర్‌తో అనుసంధానించింది. దీనిద్వారా ఎలాంటి డాక్యుమెంట్‌నైనా డిజిటల్ రూపంలో సమర్పించేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఇప్పుడు వేగంగానే పాస్‌పోర్టు జారీ ప్రక్రియ కొనసాగుతోంది.
అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
ఈ క్రమంలో మీరు పాస్‌పోర్టు అప్లై చేసుకుని ఎప్పడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆన్లైన్లో సులువుగా మీ పాస్‌పోర్టు స్టేటస్‌ను సింపుల్‌గా చెక్‌చేసుకోండిలా..
పాస్‌పోర్టు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు :
1. మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో ఆ పాస్‌పోర్టు టైప్ తెలిసుండాలి.
2. పాస్‌పోర్టు ఫైల్ నంబర్( మీరు దరఖాస్తు చేసుకున్నాక వచ్చే 15 అంకెల సంఖ్య)
3. దరఖాస్తు సమయంలో సమర్పించిన పుట్టిన తేదీ
ఒకే కార్డుపై ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్!
మీ పాస్‌పోర్టు స్టేటస్‌ను ఎలా చెక్‌చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..