Pan - Aadhaar Status : ఆదాయ పన్ను వ్యవహారాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమైన సంస్కరణే.. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ చేయడం. ఈ పని వెంటనే చేయండి అంటూ.. ఇప్పటి వరకు పలుమార్లు కోరింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT). ఆ తర్వాత గడువులు విధిస్తూ.. వాటిని పొడిగిస్తూ వచ్చింది. చిట్ట చివరగా.. ఫైన్‌తో ఈ గడువు 2023 జూన్ 30తో ముగిసిపోయింది. అయినప్పటికీ ఇంకా ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు ఏకంగా 20 శాతం ఉన్నాయట! మరి, అందులో మీరున్నారా..? లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
Central Board of Director Taxes (CBDT) :2022లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సీబీడీటీ సూచించింది. ఇందుకోసం 31 మార్చి 2022 వరకు గడువు విధించింది. ఈ సమయంలో ఉచితంగానే లింక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కొంత మంది లింక్ చేసుకున్నారు. దీంతో.. ఆ గడువును CBDT పొడిగించింది. 500 రూపాయల ఫైన్ తో లింక్ చేసుకోవచ్చంటూ.. 30 జూన్ 2022 వరకు అవకాశం ఇచ్చింది. అప్పటికీ.. అందరూ లింక్ చేసుకోకపోవడంతో.. ఈ సారి 1000 రూపాయల ఫైన్ తో 2023 జూన్ 30 వరకు ఛాన్స్ ఇచ్చింది.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయి నెల పదిహేను రోజులవుతోంది. అయితే.. ఇప్పటికీ ఆధార్ - పాన్ తో లింక్ చేసుకోని వారి సంఖ్య భారీగానే ఉందట. 2023 జూన్ 30 గడువు ముగిసిన (Pan Aadhar Link Deadline Ended) తర్వాత లెక్కలు చూస్తే.. ఏకంగా 20 శాతానికి పాన్ కార్డులు లింక్ కాలేదట.
మరి, పాన్ తో ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది అంటే.. ఆ కార్డు పనిచేయకుండా పోతుంది. అంటే.. ఇప్పటి వరకూ ఏ అవసరాలకోసం పాన్ కార్డును వినియోగించారో.. ఇకపై అలాంటి అవసరాలకు లింక్ చేయని పాన్ కార్డును ఉపయోగించలేరన్నమాట. ఇలాంటి వారు మళ్లీ కొత్త పాన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అదేం మొబైల్ సిమ్ కార్డు కాదు.. వెంటనే ఇవ్వడానికి. ఒక పాన్ కార్డు రద్దైన తర్వాత మరొకటి మంజూరు చేయాలంటే చాలా తతంగమే ఉంటుంది. అందుకే.. అలర్ట్ గా ఉండాలని కేంద్రం పలుమార్లు సూచనలు చేసింది.