తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Check India Post GDS Results 2023 : గ్రామీణ్​ డాక్​ సేవక్ పోస్టులకు ఎంపిక పూర్తి.. ఈ 30వేల మందికి ఉద్యోగాలు ఫిక్స్! - GDS 2023 డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​కు చివరి తేదీ

India Post GDS Results 2023 : ఇండియా పోస్ట్​ ఆధ్వర్యంలోని వివిధ పోస్టాఫీసుల్లో గ్రామీణ్​ డాక్​ సేవక్(GDS) పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. మొత్తం 30,041 పోస్టులకు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది భారతీయ తపాలా. మరి ఈ మెరిట్​ లిస్ట్​లో మీరూ ఉన్నారేమో ఓసారి చెక్​ చేసుకోండి.

India Post GDS Results 2023
India Post Results 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 11:12 AM IST

How to Check India Post GDS Results 2023 :ఇండియా పోస్ట్​లో కొలువు సాధించేందుకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత పోస్ట్​ జులైలో నిర్వహించిన గ్రామీణ్​ డాక్​ సేవక్​(GDS) రెండో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​లో భాగంగా 2023 జులైలో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన ఫలితాలను విడుదల అయ్యాయి. సదరు పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తపాలా అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి తమ రిజల్ట్స్​( India Post Result 2023 )ను పీడీఎఫ్​ ఫార్మాట్​లో డౌన్​లోన్​ చేసుకోవచ్చు.

India Post GDS Recruitment 2023 : ఇండియా పోస్ట్​ GDS 2023 నియామక ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ గతనెల ముగిసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్షను నిర్వహించలేదు. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 30,041 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అధికారిక వెబ్​సైట్​!
India Post Website :ఫలితాల కోసం ఇండియా పోస్ట్​ అధికారిక వెబ్​సైట్ indiapostgdsonline.gov.inను వీక్షించవచ్చు.

ఒక్క క్లిక్​తో మీ రిజల్ట్స్!
How To Check GDS Result 2023 :

  • ముందుగా indiapostgdsonline.gov.in పోర్టల్​లోకి లాగిన్​ అవ్వండి.
  • తర్వాత GDS 2023 Schedule-II, Shortlisted Candidates పక్కన '+' సింబల్​పై క్లిక్​ చేయండి.
  • ఇక్కడ మీకు రాష్ట్రాల జాబితా కనిపిస్తుంది. సంబంధిత రాష్ట్రం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్​పై క్లిక్​ చేస్తే 'List Of Shortlisted Candidates' అని చూపిస్తుంది.
  • చివరగా దానిపై క్లిక్​ చేస్తే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను మీరు చూడవచ్చు.
  • మీ రిజిస్ట్రేషన్​ నంబర్​ సాయంతో మీ రిజల్ట్​ను చెక్​ చేసుకోవచ్చు.

సెప్టెంబర్​ 16 లాస్ట్​డేట్​!
How To Check Postal Results : షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులు తమకు నిర్దేశించిన డివిజనల్​ హెడ్​ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు మీ డాక్యుమెంట్స్​ను​ వెరిఫై చేస్తారు. కాగా, దీనికి సెప్టెంబర్​ 16ను చివరితేదీగా ఫిక్స్​ చేశారు. ఇక GDS పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రిపోర్టింగ్​కు వెళ్లేముందు అన్ని ఓరిజినల్​ స్టడీ సర్టిఫికేట్స్​, పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోలతో పాటు రెండు సెట్ల జిరాక్స్​ కాపీలను తీసుకెళ్లండి( How To Check GDS Merit List 2023 ).

తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఖాళీలు!
GDS Posts in Telangana :దేశవ్యాప్తంగా మొత్తం 30,041 పోస్టులు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్​లో 1058, తెలంగాణలో 961 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి.. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇస్తారు. రోజువారీ కార్యకలాపాల కోసం ల్యాప్​టాప్/ కంప్యూటర్/ స్మార్ట్​ఫోన్ లాంటివి తపాలా శాఖనే సమకూరుస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details