How to Check Aadhaar Update History in Telugu : దేశంలో ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ.. పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఎవరు ఆధార్ అప్‌డేట్(Aadhaar Update) చేసుకోలేదో వారందరినీ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. మొదట జూన్ 14 వరకూ ఉచిత అప్‌డేట్ అవకాశాన్ని కల్పించిన యూఐడీఏఐ.. గడువును సెప్టెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు పేర్కొంది.
Check Aadhaar Update History Online :ఈ ఉచిత సర్వీస్ అవకాశం ప్రత్యేకంగా మైఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. అదే ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం సర్వీస్ ఛార్జీ నిమిత్తం రూ.50 కట్టాలి. అలాగే మీ మొబైల్ ఫోన్లోనేయూఐడీఏఐ(UIDAI)అధికారిక వెబ్‌సైట్https://myaadhaar.uidai.gov.inలో లాగిన్ అయ్యి మీ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఆధార్‌లో పేరు, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా, ఫొటో లాంటి డేటాలో మార్పులు ఆన్‌లైన్‌లో ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి. అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు అప్‌డేట్, అప్‌డేట్ స్టేటస్, అప్‌డేట్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
How to Update Aadhaar Card Details in Online Process :
ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..
- మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.inలో ఆధార్ స్వీయ-సేవ పోర్టల్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా కోడ్ ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. ఈ ప్రక్రియను ప్రామాణికరించడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
- అనంతరం డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగానికి వెళ్లాలి. అక్కడ ఇప్పటికే నమోదై ఉన్న వివరాలను సమీక్షించాలి.
- ఆ తర్వాత డ్రాప్-డౌన్ జాబితా నుంచి మీరు దేనిని అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవాలి. ఆపై అసలు పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి.
- చివరగా Submit బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ కొనసాగుతోంది.
Mobile Number Link To Aadhaar Card Online: ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేశారా..? ఇలా నిమిషాల్లో చేసేయండి!
How to Check Aadhaar Update Status in Telugu :
ఆధార్ కార్డ్ అప్‌డేట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
- మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసిన తర్వాత.. ప్రక్రియ పూర్తయిందా? లేదా? చూడాలంటే.. ఈ ఈ స్టెప్స్ ఫాలోకావాలి.
- మీరు మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. హోమ్‌పేజీలో My Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. Get Aadhaarలోకి వెళ్లి Aadhaar Update Status అనే ఆప్షన్‌కు నావిగేట్ అవ్వాలి.
- అనంతరం అక్కడ వచ్చిన అప్‌డేట్ రశీదు స్లిప్‌లో పేర్కొన్న ఎన్‌రోల్‌మెంట్ ఐడీని నమోదు చేయాలి. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి.
- అప్పుడు మీ ఆధార్ కార్డు అప్‌డేట్ స్టేటస్‌ను డ్రాఫ్ట్ స్టేజ్, చెల్లింపు దశ, ధ్రువీకరణ దశ, కంప్లీట్ అనే దశలలో స్టేటస్‌ను స్క్రీన్‌పై చూస్తారు.
మీరు రసీదు స్లిప్‌ను పోగొట్టుకుంటే..?
- రసీదు పోగొట్టుకున్నా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
- మొదట మీరు ఎన్‌రోల్ మెంట్ నంబర్ తిరిగి పొందడానికి myAadhaar వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అక్కడ అవసరమైన విభాగంలో.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTP పొందడానికి మీ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి.. Verify OTPని క్లిక్ చేయాలి.
- వెరిఫికేషన్ అనంతరం మీరు మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాలో నమోదు సంఖ్యను అందుకుంటారు.
- చివరగా మీ ఈ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆధార్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
PVC Aadhar Card Apply : 'ఆధార్' పోయిందా? PVC కార్డ్ కోసం అప్లై చేసుకోండిలా..
ఆధార్ అప్‌డేట్ హిస్టరీని చెక్ చేసుకోండిలా..
How to Check Aadhaar Update History in Online Method :
- మొదట మీరు UIDAIఅధికారిక వెబ్‌సైట్‌కి www.uidai.gov.inని సందర్శించాలి.
- ఆ తర్వాత My Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. Update Your Aadhaar అనే విభాగంలోకి వెళ్లాలి.
- అక్కడ ఆధార్ Update History అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ వంటి మీ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
- అనంతరం మీకు సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- అది కచ్చితంగా అందించకపోతే.. కొత్త సెక్యూరిటీ కోడ్‌ను పొందడానికి 'Try Another' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకోవడానికి Send OTPపై క్లిక్ చేయాలి.
- చివరగా మీకు వచ్చిన OTPని నమోదు చేసి, Submit ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ ఆధార్ కార్డు అప్‌డేట్ హిస్టరీని చూడవచ్చు.
How To Lock And Unlock Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ సేవలను లాక్, అన్‌లాక్ చేయడం తెలుసా..? చాలా ఈజీ..
How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?