TTD - Tirumala Tirupati Devastanam : వరల్డ్ లోనే రిచెస్ట్ హిందూ టెంపుల్ తిరుపతి. ఏడుకొండల మీద కొలువైన ఆ శ్రీనివాసుడుని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు. అందుకే.. తిరుమల కొండపై నిత్యం రద్దీగా ఉంటుంది. భక్తుల సంఖ్యను బట్టీ స్వామి దర్శనానికి రోజుల కొద్దీ సమయం కూడా పడుతూ ఉంటుంది. అయితే.. అత్యవసర పనుల మీద ఉండేవారి కోసం ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో వీఐపీ దర్శనం మొదలు పలు సేవలు ఉన్నాయి. సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉన్న ఆర్జిత సేవ రూ.300 ప్రత్యేక దర్శనం. ఈ టికెట్ ద్వారా త్వరగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అయితే.. ఈ టికెట్లు అంత తేలికగా లభించవు. విపరీతమైన పోటీ ఉంటుంది. ఆన్ లైన్లో విడుదల చేసిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే బుకింగ్ ముగిసిపోతుందంటే.. ఈ టికెట్లకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి, ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? టీటీడీ ఎప్పుడు విడుదల చేస్తుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
TTD Good News : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ తర్వాత మరో లోకంలోకి భక్తులు!
టీటీడీ స్పెషల్ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
When TTD Release Special Darshan Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జారీ చేసే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు.. TTD అధికారిక వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in లోకి వెళ్లాలి.ఈ టికెట్లు సాధారణంగా ప్రతినెలా చివరి వారంలో విడుదల చేస్తారు. ఎక్కువగా 24 లేదా 25 తేదీల్లో రిలీజ్ చేస్తారు.
వెబ్ సైట్లోకి వెళ్లిన తర్వాత మొబైల్ నంబర్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది.
Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి
ప్రత్యేక దర్శనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి?