Sabarimala Online Darshan Tickets Booking in Telugu : దక్షిణ భారతదేశంలోని కేరళ పతనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల అభయారణ్యంలో కొలువై ఉన్న శబరిమల మణికంఠ స్వామి యాత్ర ఏటా దివ్య మనోహరంగా సాగుతుంది. పంబా నది తీరాన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు తరలి వెళ్తుంటారు. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో(మండలం-మకరవిళక్కు సీజన్) శబరిమల(Sabarimala Ayyappa Temple)కు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వంతో కలిసి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(Travancore Devaswom Board) ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
Sabarimala Q Line Ticket Booking 2023 : దాంతో ముందుగానే క్యూ/ప్రసాదాలు/పూజ/వసతి/కనిక్క వంటి సేవలను బుక్ చేసుకోవచ్చు. "ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్" ప్రాతిపదికన ఆన్లైన్లో యాత్రికులకు టికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా 2023 ఏడాదికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. అయితే.. మీరు ఈ ఏడాది శబరిమల వెళ్లాలనుకుంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రశాంతంగా శబరిగిరీశుడిని దర్శించుకోండి. ఇంతకీ.. ఎప్పటి నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి? ఎలా బుక్ చేసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఏడాది మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమల వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే.. మంత్లీ పూజ(తులం) టికెట్లు అక్టోబర్ 17 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే Sree Chithira Attathirunnal ఆన్లైన్ టికెట్లు నవంబర్ 10 నుంచి 11 వరకు, మండల పూజ మహోత్సవం టికెట్లు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. శబరిమల వెళ్లే భక్తులు తాము దర్శించుకునే రోజు, సమయం వంటి వివరాలతో ఈ వర్చువల్ క్యూలైన్ బుకింగ్ చేసుకోవాలి.
శబరిమల ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ కోసం అవసరమైన పత్రాలు
- శబరిమల అయ్యప్పను సందర్శించాలనుకునే వ్యక్తి గుర్తింపు కార్డు
- ఫొటోగ్రాఫ్
- ఫోన్ నంబర్
- ఈ-మెయిల్
శబరిమల Q ఆన్లైన్ బుకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- అయ్యప్ప భక్తులు అధికారిక వెబ్సైట్లో శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్‌ను పూర్తి చేస్తే వార్షిక తీర్థయాత్రకు హాజరుకావచ్చు.
- మీరు తీర్థయాత్రలో ప్రయాణించి, ప్రసాదాలు, పూజ, కణిక, వసతిని యాక్సెస్ చేస్తే వర్చువల్ Q వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
- ముందుగా మీరు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఈ మెయిల్ IDతో సైన్ అప్ చేయాలి.
- ఒకవేళ మీరు ఇప్పటికే సభ్యులు అయితే డైరెక్ట్‌గా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- మండల మకరవిళక్కు తీర్థయాత్ర కోసం వర్చువల్ Q కూపన్లు అధికారిక సైట్ ద్వారా మాత్రమే లభిస్తాయి.
- TDB లేదా కేరళ పోలీసులు ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ కౌంటర్లతో పాటు ఏ థర్డ్-పార్టీ ఏజెంట్లు టిక్కెట్లను విక్రయించవు.
How to Book Rooms in Sabarimala : మీరు శబరిమల వెళ్తున్నారా.. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?