How to Rooms Book in Sabarimala Online : దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అత్యంత ప్రసిద్ధ, ఆధ్యాత్మిక, పురాతన యాత్ర స్థలాల్లో ఒకటిగా శబరిమల ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ మహిమాన్విత ఆలయం కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల ఆభయారణ్యంలో ఉంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పొందాలంటే సాధారణ విషయం కాదనేది చాలా మంది భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష కొనసాగుతోంది. ధర్మశాస్త్ర నిబంధనల ప్రకారం 41 రోజులు భక్తులు మాలలు ధరించి నియమనిష్ఠలతో స్వామిని ఆరాధిస్తారు. చివరి రోజు ఇరుముడితో స్వామి దర్శనార్థం శబరిమల కొండ(Sabarimala Ayyappa Temple)కు బయలుదేరుతారు.
Sabarimala Rooms Online Booking Procedure :ఈ క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరే భక్తులు ముందే ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు. దీనికి ఫొటో, ఆధార్ కార్డు(Aadhaar Card) ఉంటే సరిపోతుంది. అయితే.. అక్కడ ఎలాంటి గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లు ఉండవు. కానీ శబరిమల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాత్రం స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు గదుల రూపంలో బస ఏర్పాట్లను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. శబరిమలకు కుటుంబ సభ్యులతో వెళ్లే యాత్రికుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే గదులను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. చాలా మంది భక్తులు ఎలా గదులను బుక్ చేసుకోవాలో తెలియక అక్కడికి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఆ పరిస్థితి ఎదుర్కోకుండా.. ముందుగానే రూమ్ బుక్ చేసుకోండి.
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై విమానాల్లోనూ ఇరుముడి
బుకింగ్ ప్రాసెస్ ఇలా :
Sabarimala Accommodation Online Booking Procedure :శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల కోసం కేరళ ప్రభుత్వంతో కలిసి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆన్‌లైన్‌లో ఆలయం పరిసరాలలో గదులను బుక్చేసుకోవడానికి కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా భక్తులు తాము ఏ తేదీన దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ సమయానికి దర్శించుకునేలా ఆన్‌లైన్‌లో టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.