తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్లో హాఫ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు - మీకు తెలుసా?

How to Book Half Ticket in Indian Railways: పిల్లలతో రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవచ్చని మీకు తెలుసా? 12 ఏళ్ల లోపు పిల్లలకు ఈ రూల్ వర్తిస్తుంది. మరి.. అది ఎలా బుక్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

how to book half ticket in trains
how to book half ticket in trains

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 11:34 AM IST

Updated : Nov 4, 2023, 12:03 PM IST

How to Book Half Ticket in Indian Railways and Half Ticket Rules: సాధారణంగా పిల్లలతో రైలు ప్రయాణం చేసే వారిలో అనేక సందేహాలు ఉంటాయి. ఏ వయస్సు లోపు ఉన్నవారికి రైలు టికెట్ తీసుకోవాలి..? అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇక హాఫ్ టికెట్ అనేది రైల్లో కూడా ఉంటుందని మెజారిటీ ప్రజలకు తెలియదు. అయితే.. పిల్లలకు సంబంధించిన రైలు టికెట్ల బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే.. పలు నియమ నిబంధనల్ని రూపొందించింది.

ఆ నిబంధనల ప్రకారం.. ఐదేళ్ల లోపు పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు టికెట్ లేకుండా రైలులో ప్రయాణించవచ్చు. రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ రైళ్లకు ఇదే రూల్ వర్తిస్తుంది. ఒకవేళ పిల్లలకు కూడా ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కావాలనుకుంటే మాత్రం పూర్తి ఛార్జీ చెల్లించి బెర్త్ రిజర్వేషన్ చేయించుకోవాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులు అయితే దివ్యాంగుల కోటాలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది.

SCR Extends Festive Special Trains : పండగ స్పెషల్.. ఆ రైళ్లు పొడిగింపు..!

అన్‌రిజర్వ్‌డ్ రైళ్లల్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు సగం ఛార్జీతో టికెట్ తీసుకోవచ్చు. ఇక ఐదేళ్ల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు రిజర్వేషన్లో బెర్త్ కోరుకుంటే మాత్రం.. పూర్తి ఛార్జి చెల్లించాలి. 12 ఏళ్లు దాటిన పిల్లలకు మాత్రం అన్ని రైళ్లల్లో పూర్తి ఛార్జీ వర్తిస్తుంది. మరి, హాఫ్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా యాప్​ను ఓపెన్ చేయండి.
  • మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి.
  • ఒకవేళ మీకు అకౌంట్​ లేకపోతే.. రిజిస్టర్​ ఆప్షన్​పై క్లిక్​ చేసి బేసిక్​ వివరాలను ఎంటర్ ​చేసి రిజిస్ట్రేషన్​ పూర్తి అయిన తర్వాత ఆ వివరాలతో లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత ట్రైన్​ సింబల్​పై క్లిక్​ చేసి.. Book Ticket ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ప్రయాణించే తేదీ, ఏ క్లాస్​లో ప్రయాణించాలనుకుంటున్నారో..ఆ వివరాలను ఎంటర్​ చేసి Search Trains ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • మీకు స్క్రీన్​ మీద కనిపించిన ట్రైన్స్​ నుంచి మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలు సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం Passenger Details పైన క్లిక్ చేసి.. పేరు, వయసు, జెండర్​ వంటి వివరాలను ఎంటర్​ చేయాలి.
  • పసిపిల్లల ఉంటే Add Infant పైన క్లిక్ చేసి వివరాలు యాడ్ చేయాలి.
  • 5 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ కావాలనుకుంటే Allot Berth పైన క్లిక్ చేసి పేమెంట్​ విధానాన్ని ఎంపిక చేసుకుని పూర్తి ఛార్జీ చెల్లించాలి. బెర్త్​ అవసరం లేదనుకుంటే ఫ్రీ గా ట్రావెల్​ చేయవచ్చు.
  • 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ కావాలనుకుంటే Allot Berth పైన క్లిక్ చేసి పూర్తి ఛార్జీ చెల్లించాలి.
  • 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ వద్దనుకుంటే Allot Berth ఆప్షన్‌కు ఉన్న టిక్ తీసేసి సగం ఛార్జీ చెల్లించాలి.
  • పేమెంట్​ సక్సెస్​ అయిన తర్వాత ట్రైన్​ టికెట్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.
Last Updated : Nov 4, 2023, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details