తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How To Book Entire Coach In Train : ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారా?.. తక్కువ ధరకే మొత్తం కోచ్​నే బుక్ చేసుకోండిలా!

How To Book Entire Coach In Train: కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దూర ప్రయాణం చేయాలనుకుంటున్నారా?. అయితే రైల్లో ఓ కోచ్​ను లేదంటే మొత్తం రైల్​నే బుక్ చేయొచ్చనే విషయం మీకు తెలుుసా?. అందుకోసం రైల్వేశాఖ ఫుల్​ టారిఫ్ రేట్ సర్వీస్​ను అందిస్తోంది. ఏ విధంగా మొత్తం కోచ్​ను లేదా రైలును రిజర్వ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

How To Book Entire Coach In Train
How To Book Entire Coach In Train

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 12:30 PM IST

How To Book Entire Coach In Train :దూర ప్రాంతాలకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లాలనుకున్నపుడు రైలు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటాం. బస్సు, విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు కన్నా రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చవుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం మొత్తం కోచ్​నే రిజర్వ్ చేసుకునే సౌలభ్యం రైల్వే కల్పించింది. దానినే ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ అని పిలుస్తున్నారు. ఏ విధంగా ఈ సర్వీస్​ను బుక్ చేసుకోవాలి? ఒక బోగీని రిజర్వ్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.

ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ ద్వారా..
మనం ఒకవేళ ఎక్కువమందితో ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాలనుకున్నపుడు ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్​ను ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ ద్వారా ఓ కోచ్​ను లేదా మొత్తం రైలునే బుక్ చేసుకునే సౌలభ్యాన్నిరైల్వేకల్పిస్తుంది. ఎవరైనా ఈ సేవను వినియోగించుకోవచ్చు.

కోచ్​/మొత్తం రైలును రిజర్వ్ చేసుకునే విధానం..

  • ముందుగాhttps://www.ftr.irctc.co.in/ftr వెబ్​సైట్​ని సందర్శించండి.
  • వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి స్పెషల్ ఐడీ, పాస్​వర్డ్​ను క్రియేట్ చేసుకొండి.
  • మీ వద్ద ఉన్న ఐడీ, పాస్​వర్డ్ ఉపయోగించి సంబంధిత https://www.ftr.irctc.co.in/ftr వెబ్​సైట్​లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • లాగిన్ అయ్యాక మనకు కోచ్​ను, మొత్తం రైలును బుక్ చేసుకోవడానికి రెండు ఆప్షన్​లు ఉంటాయి.
  • మన అవసరానికి అనుగుణంగా వీటిలో ఏదైనా ఆప్షన్​ని ఎంచుకోవచ్చు.
  • ప్రయాణించాలనుకుంటున్న తేదీ, కోచ్ మొదలైన వివరాలు నమోదు చేయాలి.

పేమెంట్ విధానం :

  1. వివరాలన్నింటిని నమోదు చేశాక మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  2. కోచ్​ను రిజర్వ్ చేయడం కోసం పేమెంట్ గేట్​వే ఆప్షన్​పై క్లిక్ చేసి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
  3. అమౌంట్ చెల్లించే ముందు దానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకొండి.
  4. మీరు AC ఫస్ట్ క్లాస్​, AC 2 టైర్, AC 3 టైర్, AC కమ్ త్రీ టైర్, AC ఛైర్ కార్, స్లీపర్ వీటిలో ఏదైనా ఎంచుకునే అవకాశం మీకుంది.
  5. మీరు ఎటువంటి కోచ్​ను ఎంచుకున్నారు అనే దానికి అనుగుణంగా రైల్వే వారు నిర్ణయించిన నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఫుల్​ టారీఫ్ రేట్ సేవలను వినియోగించుకునేందుకు రైల్వేశాఖ కొన్ని నియమాలు రూపొందించింది అవేంటో తెలుసుకుందాం.

  • ఫుల్ టారీఫ్ సేవలను వినియోగించుకునేందుకు గానూ మనం మొత్తం ధరకు అధనంగా 30 నుంచి 35 శాతం చెల్లించాలి.
  • సెక్యూరిటీ డిపాజిట్​ను కూడా చెల్లించాలి. మన ప్రయాణం పూర్తయ్యాక రైల్వే తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.
  • మీరు ఒక కోచ్​ను రిజర్వ్ చేయాలనుకుంటే రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది.
  • మీరు రైల్లో కోచ్​లన్నింటిని బుక్ చేయాలనుకుంటే రూ.9లక్షలు చెల్లించాలి.
  • పుల్ టారిఫ్​​ రేట్ సర్వీస్ ద్వారా రిజర్వేషన్​ను మీరు ముందుగానే చేసుకోవచ్చు.
  • మీరు ప్రయాణించాల్సిన తేదీ కంటే 30 రోజుల నుంచి 6నెలల ముందుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు.
  • ఒక వేళ మీ ప్రయాణం వాయిదా పడితే మీరు రిజర్వేషన్​ను రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంది.

How To Change Train Journey Date : ట్రైన్​ జర్నీ​ తేదీ మార్చాలా?.. పై క్లాస్​కు అప్​గ్రేడ్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

Indian Railway Rules For Passengers : రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ రూల్స్​ తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details