How to Book Ayodhya Ram Mandir Free Aarti Pass By Online and Offline: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందులో భాగంగా.. జనవరి 16 నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరాముడికి సేవ చేసుకునేందుకు.. అయోధ్య రామాలయ ట్రస్టు అవకాశం అందించింది. రామాలయంలో నిర్వహించే "హారతి" కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచితంగా పాసులను అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ పాసులు పొందవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం..
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్‌కు 1000 ప్రత్యేక రైళ్లు- ఎప్పట్నుంచంటే?
ఆలయంలో మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. అవి.. శృంగార హారతి, భోగ హారతి, సంధ్యా హారతి.
- శృంగార హారతి:ఇది ఉదయం హారతి. ఇక్కడ భగవంతుడు రామ్ లల్లాను దుస్తులు, ఆభరణాలతో అలంకరిస్తారు. ఇది ఉదయం 6:30కి ప్రారంభమవుతుంది.
- భోగ హారతి:ఇది మధ్యాహ్నం హారతి. ఇక్కడ లార్డ్ రామ్ లల్లాకు ఆహారం, స్వీట్లు అందిస్తారు. ఇది మధ్యాహ్నం 12:00కి ప్రారంభమవుతుంది.
- సంధ్యా హారతి:ఇది సాయంత్రం హారతి. ఇక్కడ బాల రాముడిని నిద్రించడానికి సిద్ధం చేస్తారు. ఇది రాత్రి 7:30కి ప్రారంభమవుతుంది.
గ్రౌండ్ ఫ్లోర్లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!
హారతి పాస్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అఫీషియల్ వెబ్‌సైట్ https://srjbtkshetra.org/ విజిట్ చేయాలి.
- హోమ్‌పేజీలో స్క్రీన్ మీద కనిపించే Click to Contribute ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు Home ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మొబైల్ నెంబర్‌కు వచ్చే OTP ఉపయోగించి లాగిన్ కావాలి.
- హోమ్‌పేజీలోనే ‘హారతి(Aarti)’ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత హాజరు కావాలనుకుంటున్న హారతి తేదీ, రకాన్ని ఎంచుకోవాలి.
- తర్వాత పేరు, చిరునామా, ఫొటో మొదలైన వివరాలను నమోదు చేయాలి.
- చివరగా పాస్‌ను ప్రింట్ చేసుకోవాలి లేదా డివైజ్‌లో సేవ్ చేయాలి.