TSRTC Student Bus Pass Application Process :తెలంగాణ ఆర్టీసీ.. రాష్ట్రంలోని పలు వర్గాలకు వివిధ రకాల రాయితీలు అందిస్తోంది. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. చదువుకునే వారికి చేయూతనిచ్చేందుకు.. రాయితీతో కూడిన బస్ పాస్ అందిస్తోంది ఆర్టీసీ. హైదరాబాద్ నగరం సహా.. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది విద్యార్థులు బస్ పాస్(Student Bus Pass) సౌకర్యంతో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. వీరంతా ప్రతినెలా బస్ పాస్ రెన్యూవల్ కోసం.. ఆ కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. దీంతో.. ఆర్టీసీ బస్ పాస్ సేవలను ఆన్‌లైన్ చేసింది. మరి.. ఆన్‌లైన్ ద్వారా కొత్త బస్ పాస్‌కు ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా రెన్యూవల్ చేసుకోవాలి? అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
How to Apply TSRTC Student Bus Pass in Online :
TSRTC స్టూడెంట్ బస్ పాస్ కోసం ఇలా అప్లై చేసుకోండి..
- మొదటగాhttps://online.tsrtcpass.inలో TSRTC బస్ పాస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అప్పుడు మీరు 'Apply' బటన్‌పై క్లిక్ చేసి.. మీ జిల్లాను ఎంచుకోవాలి.
- అనంతరం 'Passes for School Students' అనే సెక్షన్‌ను ఎంచుకొని అప్లై అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో.. నిబంధనలు చదివిన తర్వాత.. Apply బటన్‌పై క్లిక్ చేస్తే.. బస్ పాస్ అప్లికేషన్ ఫామ్.. స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఇప్పుడు విద్యార్థి వివరాలు, ఇంటి అడ్రస్, పాఠశాల వంటి వివరాలను నమోదు చేయాలి. రూట్ వివరాలను కూడా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత డ్రాప్-డౌన్ మెనూ నుంచి "చెల్లింపు మోడ్ & పాస్ కలెక్షన్" ఎంచుకోవాలి. మీరు నమోదు చేసిన వివరాలను మరోసారి ధ్రువీకరించుకొని ఆపై "Submit" బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ బస్ పాస్ డబ్బు చెల్లింపు చేయాలి.
- డబ్బు చెల్లింపు పూర్తయిన తర్వాత.. TSRTC బస్ పాస్ మంజూరు అవుతుంది.
- ఈ దరఖాస్తు ఫారాన్ని మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అందులో.. పాస్ ఎప్పుడు వస్తుందనే డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ సమయానికి బస్ పాస్ అందుతుంది.
Note : పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులంతా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
TSRTC Special Buses For Rakhi Pournami : రాఖీ పౌర్ణమి స్పెషల్.. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక బస్సులు
How to Check Student Bus Pass Application Status :
TSRTC స్టూడెంట్ బస్సు పాసు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడమెలా..
- ఒక్కోసారి చెప్పిన సమయానికి బస్ పాస్ రాకపోవచ్చు. అప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం.. మొదట మీరు TSRTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీని క్రిందికి స్క్రోల్ చేసి "స్టూడెంట్ సర్వీసెస్" విభాగంలోని "ట్రాక్ అప్లికేషన్"పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు.. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పేజీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా "ట్రాక్ అప్లికేషన్" ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం డ్రాప్-డౌన్ జాబితా నుంచి ఆన్‌లైన్ రిజిస్టర్డ్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకోవాలి.
- మీరు ఆన్‌లైన్ రిజిస్టర్డ్ ఐడీని ఎంచుకుంటే దానిని నమోదు చేయాలి. లేకపోతే మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లేదా ఈమెయిల్ ID, పుట్టిన తేదీని టైప్ చేయాలి.
- ఇప్పుడు మీరు 'Commuter Type' as 'Student' అనే ఆప్షన్ ఎంచుకుని.. చివరగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అంతే.. మీ TSRTC స్టూడెంట్ బస్ పాస్ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
TSRTC Palle Velugu Town Bus Pass : మరో గుడ్‌న్యూస్ చెప్పిన TSRTC.. ఇకపై 'పల్లె వెలుగు' బస్ పాస్
How to Renewal TSRTC Bus Pass in Online :
TSRTC బస్ పాస్ రెన్యూవల్ చేసుకోండిలా..
- బస్ పాస్ రెన్యూవల్ ఎలా చేసుకోవాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం.
- దరఖాస్తుదారు మొదట టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ https://mis.tsrtcpass.inని సందర్శించాలి.
- ఆ తర్వాత లాగిన్ విభాగానికి వెళ్లి, మీ 'యూజర్ నేమ్', పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే లాగిన్ ప్రక్రియను పూర్తి అవుతుంది.
- అప్పుడు మీరు పోర్టల్‌లోకి లాగిన్ అవుతారు. అనంతరం.. రెన్యూవల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసి.. 'Renewal' బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు అది చెల్లింపు పేజీకి వెళ్తుంది. మీరు తీసుకున్న బస్సు పాసుకు సంబంధించిన డబ్బు చెల్లించాలి.
- చివరగా TSRTC బస్ పాస్ డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..
TSRTC Bus Charges 10 percent Discount : సూదూర ప్రాంతాలు ప్రయాణించేవారికి.. టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్