How to Apply One Nation One Ration Card in Online : దేశ ప్రజలకు ఆధార్, పాన్‌కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా ఒక ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఈ కార్డుతో సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు లభిస్తున్నాయి. ఇది ఒక గుర్తింపు కార్డుగానూ పనిచేస్తోంది. అయితే.. ఇప్పటికే కేంద్రం'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు'(One Nation One Ration Card) వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం అమలు ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ మీకు కార్డు లేకపోతే.. సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి విధించిన కొన్ని నిబంధనలు..
- రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
- ఇతర రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులు ఆ వ్యక్తి వద్ద ఉండరాదు.
- ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.
- అలాగే 18 సంవత్సరాల కన్న తక్కువ వయస్సు ఉంటే.. ఆ వ్యక్తికి తల్లిదండ్రుల పేరు మీదే రేషన్ కార్డు ఇవ్వబడుతుంది.
- కుటుంబ సభ్యులెవరికీ మరో రేషన్ కార్డులో పేరు ఉండకూడదు.
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :
Required Documents for One Nation One Ration Card :ఓటరు ఐడి, ఆధార్ కార్డు(Aadhaar Card), పాస్‌పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఐ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రేషన్ కార్డు తయారు చేయడానికి ఐడీ ప్రూఫ్‌గా ఇవ్వవచ్చు. ఇవే కాకుండా పాన్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇంటి చిరునామా, గ్యాస్ కనెక్షన్ బుక్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, అద్దె ఒప్పందం వంటి పత్రాలనూ కూడా ఇవ్వవలసి ఉంటుంది.
How to Apply for One Nation One Ration Card Scheme :
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోండిలా..
- ముందుగా ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారు మళ్లీ కొత్త రేషన్ కార్డు(New Ration Card) కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
- "వన్ నేషన్ వన్ రేషన్" కార్డు కోసం అన్ని రాష్ట్రాలు వారి తరపున ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాయి.
- అయితే మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో, అక్కడి వెబ్‌సైట్‌కి వెళ్లి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- అన్ని రాష్ట్రాలు లబ్ధిదారుల రేషన్ కార్డును ధృవీకరించి, ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
- రేషన్‌ను తిరస్కరించే సమస్య లేకుండా ఉండేందుకు లబ్ధిదారులందరి డేటాబేస్‌ను పీడీఎస్‌తో అనుసంధానం చేస్తారు.
- దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ వలస కార్మికుడు సబ్సిడీ రేషన్‌ను కోల్పోకూడదు.
- ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల పేదలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తుంటారు.
- అలాంటి వారు అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు.