Shaadi Mubarak / Kalyana Lakshmi Status : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు తీసుకొచ్చిన పథకాలే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్. ఈ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లికి 1,00,116 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. మరి, ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? ఎలాంటి పత్రాలు సమర్పించాలి? స్టాటస్ ఎలా తెలుసుకోవాలి? వంటి పూర్తి సమాచారాన్ని ఈ స్టోరీలో చూద్దాం.
ఇవీ అర్హతలు..
Eligibility for Shaadi Mubarak / Kalyana Lakshmi :
- కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు శాశ్వతంగా తెలంగాణ వాసులై ఉండాలి.
- వధువుకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- వరుడి వయస్సు కనీసం 21 ఏళ్లపైన ఉండాలి.
- కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి.
ఎలాంటి పత్రాలు అవసరం?
Which Documents need for Kalyana Lakshmi /Shaadi Mubarak :
- వధువు ఫొటో
- వధువు బర్త్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- వధువు, ఆమె తల్లి బ్యాంకు పాస్‌బుక్ కాపీ
- ఈ పత్రాలను స్కాన్ చేసి.. jpg ఫార్మాట్లో, సైజ్ 150KB కన్నా తక్కువ ఉండేలా సేవ్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.
- దరఖాస్తుదారులు ఆన్ లైన్లో స్వయంగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే.. మీ సేవా కేంద్రాన్ని సందర్శించినా సరిపోతుంది.
Dharani Portal Telangana How it Works : "ధరణి" పోర్టల్ ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది..?
ఎలా దరఖాస్తు చేయాలి?
How to Apply Kalyana Lakshmi /Shaadi Mubarak :
- ముందుగా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కాస్త కిందకు స్క్రోల్ చేస్తే "కళ్యాణ లక్ష్మి /షాదీ ముబారక్" ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే.. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు తెరుచుకున్న పేజీలో.. పైన కల్యాణ లక్ష్మీ, కింద షాదీ ముబారక్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇక్కడ "రిజిస్ట్రేషన్" అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు పెళ్లికూతురు వ్యక్తిగత సమాచారం మొదలు.. కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలన్నీ సమర్పించాలి.
- ఆ తర్వాత వరుడి వయస్సు కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. మరికొంత సమాచారం అందించాలి.
- చివరలో అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి.
- సమాచారం మొత్తం అందించిన తర్వాత.. "Submit" ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
How to Apply for New Gas Connection in Online : ఆన్లైన్లో కొత్త గ్యాస్ కనెక్షన్.. చాలా ఈజీగా అప్లై చేసుకోండి!
స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
How to Know the Status of Kalyana Lakshmi and Shaadi Mubarak :
- కల్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.. పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆమోదం లభించిందా లేదా? అనే స్టేటస్ తెలుసుకునే సౌలభ్యం కూడా ఆన్లైన్లో ఉంది.
- ఇందుకోసం కూడా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌నే సందర్శించాలి.
- దరఖాస్తు చేసే సమయంలో హోమ్ పేజీలో క్లిక్ చేసిన.. కల్యాణ లక్ష్మీ/షాదీముబారక్ ఆప్షన్ పైనే క్లిక్ చేయాలి.
- ఇక్కడ Registration ఆప్షన్ కింద Pring/Status అనే ఆప్షన్ ఉంటుంది.
- ఇప్పుడు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే చాలు.. వెంటనే సమాచారం అందిస్తుంది.
- పథకం ప్రారంభించిన మొదట్లో.. రూ.51,000 సాయం అందించింది ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని రూ. 75,116లకు, ఆ తర్వాత రూ.1,00,116లకు పెంచింది.
- నిధులు నేరుగా వధువు తల్లి ఖాతాలో జమ అవుతాయి.
కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు
Kalyana Lakshmi Funds Fraud: పెళ్లికి ముందే 'కల్యాణలక్ష్మి'... పక్కా ప్లాన్‌తో కొట్టేశారిలా!!