తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Apply for Indane Gas New Connection : ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్​ కావాలా..? ఆన్​లైన్​లో ఇలా అప్లై చేయండి! - ఆన్​లైన్​లో ఇండేన్ కొత్త గ్యాస్ కనెక్షన్

How to Apply for Indane Gas New Connection : మీరు కొత్తగా ఇండేన్ వంటగ్యాస్(LPG) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. గతంలో మాదిరిగా ఏజెన్సీ వద్దకు వెళ్లి, లైన్లో నిలబడి చాలా సేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్​గా మీరు ఉన్న చోటు నుంచే ఆన్​లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్​కు అప్లై చేసుకోవచ్చు. మరి, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Indane Gas New Connection
How to Apply for Indane Gas New Connection

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 5:31 PM IST

How to Apply for Indane Gas New Connection in Online :గతంలో కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే.. అదొక పెద్ద పని. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దేశంలో గ్యాస్ పంపిణీ సంస్థలు సేవలు సులభతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో ఇండేన్ వంటగ్యాస్(LPG) కలెక్షన్‌ తీసుకోవడాన్ని చాలా ఈజీ చేసింది. మరి, కొత్త కనెక్షన్​కోసం ఏవిధంగా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Required Documents for Indane Gas New Connection :

ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం అవసరమైన పత్రాలు :

  • ఆధార్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటర్ ఐడీ
  • టెలిఫోన్/నీటి/ విద్యుత్ బిల్లు
  • పాస్​పోర్ట్
  • బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
  • ఇంటి రిజిస్ట్రేషన్ పత్రం
  • ఫ్లాట్ స్వాధీనం లేఖ

పై జాబితాలో ఏదో ఒకటి గుర్తింపు పత్రంగా సమర్పించాల్సి ఉంటుంది.

How to Apply for Indane Gas New Connection in Online :

ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • మీరు మొదటగా ఇండేన్ గ్యాస్ అధికారిక వెబ్​సైట్ సందర్శించి.. New Gas Connection అనే లింక్ క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు ఓపెన్ అయిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
  • రాష్ట్రం, పంపిణీదారు పేరు, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ముఖ్యమైన వివరాలను అందించాలి.
  • అనంతరం అక్కడ వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి 'Submit' బటన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు అవసరమైన KYC పత్రాలు, గుర్తింపు, చిరునామా రుజువు, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
  • ఆపై రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మీ పత్రాలు ధృవీకరించబడతాయి.
  • మీరు నమోదుచేసిన అన్ని వివరాలు సరైనవయితే మీ దరఖాస్తు ఆమోదించబడుతుంది. మీకు ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ వస్తుంది.

How to Book Gas Cylinder Using Gpay : గూగుల్ పే ఉపయోగించి గ్యాస్ సిలిండర్​ బుక్​ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

How to Apply for Indane Gas New Connection in Offline :

డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్‌ని ఆఫ్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేయండి..

  • మీ సమీపంలోని ఇండేన్ LPG డిస్ట్రిబ్యూటర్​ కార్యాలయానికి వెళ్లండి.
  • మీకు తెలియకుంటే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్​కు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
  • ఆఫీసుకు వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫారమ్​ ఇస్తారు.
  • అందులో.. మీ వ్యక్తిగత వివరాలతో నింపి.. చిరునామా రుజువు, గుర్తింపు రుజువు వంటి KYC పత్రాలను యాడ్ చేసి డిస్ట్రిబ్యూటర్​కి ఇవ్వాలి.
  • అలాగే.. మీకు సబ్సిడీ వర్తిస్తే అందుకోసం రెండు ఫొటో కాపీలు, సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలు ​ను సమర్పించాలి.
  • ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత.. మీ గ్యాస్ డీలర్ కొత్త కనెక్షన్​ విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా.. లేదా ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరిస్తారు.

IOCL Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. IOCLలో అప్రెంటీస్ ఉద్యోగాలు!

Gas Agency How To Open : 'గ్యాస్ ఏజెన్సీ' బిజినెస్​తో సూపర్ ఆదాయం.. లైసెన్స్ ఎలా పొందాలి? అర్హతలేంటి?

How to Claim LPG Insurance Policy: గ్యాస్​ సిలిండర్​ పేలితే ఇన్సూరెన్స్​.. ఎలా పొందాలో మీకు తెలుసా..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details