How To apply H1B Visa From India : అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. చివరకు అక్కడే స్థిరపడాలనే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. దీనికోసం చాలా కష్టపడి చదువుతారు. కానీ.. యూఎస్‌లో జాబ్ చేసే అదృష్టం అందరికీ అంత ఈజీగా రాదు. ఎందుకంటే.. ఆ దేశంలో వర్క్ చేసుకోవాలంటే.. అందుకు ఆ దేశం అనుమతి ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన వీసానే.. H1బీ వీసా అంటారు. ఈ వీసా వస్తేనే.. ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అయితే.. అడిగిన వారందరికీ అమెరికా వీసా ఇవ్వదు. కానీ.. ఆశావహులు మాత్రం లక్షలాదిగా ఉంటారు. ఈ నేపథ్యంలో.. లాటరీ పద్ధతిలో హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్నారు. ఇవి కొన్ని వేలు మాత్రమే ఉంటాయి.
How To Get H1B Visa For USA : దీనికోసం ఆశావహులు పక్కాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తారు. ఆ తర్వాత లాటరీ ప్రక్రియ పూర్తి చేస్తారు. లాటరీలో ఎంపికైన వారి వివరాలను యూఎస్‌సీఐఎస్ (USCIS) వెబ్‌సైట్‌లో పెడతారు. ప్రతీ సంవత్సరం యూఎస్ హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మరి ఎవరు హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి ? రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి ? దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఏవి ? ఫీజు ఎంత ఉంటుంది అనే వివరాలను ఓసారి చూస్తే..
Apply ForH1BVisa From India : ఐటీ, సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి.. హెచ్1బీ వీసాలు ఇస్తారు. ప్రతీ సంవత్సరం మూడు లక్షలకు పైగా భారతీయులు.. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటారు. కానీ.. వారిలో కేవలం 11 శాతం మందికి మాత్రమే వీసాలు లభిస్తాయి. దీన్నిబట్టి హెచ్1బీ వీసా కోసం ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. పోటీ ఈ స్థాయిలో ఉన్నందునే.. హెచ్1బీ వీసాల ఎంపిక ప్రక్రియను లాటరీ పద్ధతిలో చేపడతున్నారు. ఈ హెచ్1బీ వీసాల దరఖాస్తు కోసం www.uscis.gov. వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హెచ్1బీ వీసా కోసం కావాల్సిన పత్రాలు..
- పాస్‌పోర్టు
- అపాయింట్‌మెంట్ లెటర్
- న్యాయ శాఖ లేఖ కాపీ
- మీ ప్రాంతం కాన్సులర్ జనరల్ లేఖ కాపీ
- పాస్‌పోర్ట్ స్టాంప్డ్ పేజీల కాపీ
- ప్రస్తుత వీసా కాపీ
- I-94 ఫారమ్
- అపాయింట్‌మెంట్ షెడ్యూల్ లెటర్
- 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
- ఇటీవలి CV లేదా రెజ్యూమ్
- DS-160 బార్‌కోడ్ నిర్ధారణ