తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Apply for Gold Monetization Scheme : ఈ స్కీమ్​లో చేరండి.. మీ ఇంట్లో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించండి.! - గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అర్హతలు

How to Apply for Gold Monetization Scheme : మీకు ఈ విషయం తెలుసా.. మీ ఇంట్లో ఉన్న బంగారంపై మీరు డబ్బులు పొందవచ్చు. వాడకంలో లేని బంగారం కోసం కేంద్రం 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' తీసుకొచ్చింది. దీంట్లో చేరడం ద్వారా మీ బంగారం వాల్యూపై వడ్డీని పొందవచ్చు. అలాగే మీ గోల్డ్ సురక్షితంగా ఉంటుంది. ఇంతకీ ఈ స్కీమ్​లో ఎలా చేరాలని ఆలోచిస్తున్నారా? అయితే.. ఇంకేందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.

Gold Monetization Scheme
Gold

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 1:24 PM IST

How to Apply for Gold Monetization Scheme :ప్రజలకు బంగారం అంటే ఎనలేని ప్రేమ. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు. తమ వద్ద బంగారం ఉంటే అదొక పరపతిగా భావిస్తారు. డబ్బులు సంపాదించే దానిని బట్టి వివిధ రూపాల్లో బంగారాన్ని కొని దాచుకుంటారు. ఎంతలా అంటే ప్రపంచంలోని మొత్తం బంగారం(Gold)నిల్వల్లో దాదాపు 11% భారతీయ కుటుంబాల వద్దే ఉన్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. వాడకంలో లేని, ఇళ్లలో ఉన్న బంగారాన్ని వారికి ఉత్పాదక ఆస్తిగా మార్చాలని భావించింది. అందుకే.. 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(GMS)'ను తీసుకొచ్చింది. ఇంతకీ.. ఈ స్కీమ్​లో చేరడానికి కావాలసిన అర్హతలు ఏంటి? ఏ విధంగా దీనికి అప్లై చేసుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

What is Gold Monetization Scheme in Telugu :ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను కేంద్రం 2015లో లాంచ్ చేసింది. భారత్ బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు, ఇళ్లలో ఉన్న బంగారాన్ని ప్రొడెక్టివ్‌గా మార్చడమే ఈ స్కీమ్‌ను ఉద్దేశం. ఈ స్కీమ్ కింద ఎవరైనా తమ బంగారాన్ని బ్యాంకులలో డిపాజిట్(Gold Deposit) చేసి నెలనెలా వడ్డీని పొందవచ్చు. కనీసం 10 గ్రాముల బంగారం దగ్గరి నుంచి ఈ పథకంలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Gold Monetization Scheme Application Process : ఈ స్కీమ్​లో చేరడానికి గరిష్ఠంగా పరిమితంటూ ఏమీ లేదు. దీంట్లో ఏడాది నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో మీరు బంగారాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో వివిధ టర్మ్స్ ఉన్నాయి. అందులో మీకు తగినవిధంగా ఏ టర్మ్ అయినా ఎంచుకోవచ్చు. అందుకుగాను బ్యాంకులు 2.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. దేశంలో ఉన్న ఏ బ్యాంకు వద్దకు వెళ్లైనా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో మనం చేరవచ్చు. ఈ స్కీమ్‌లో.. ఇతర స్కీమ్‌ల మాదిరిగానే మెచ్యూరిటీ తర్వాత.. మీ డిపాజిట్ చేసిన బంగారం, దాని వాల్యూపై వడ్డీని మీరు పొందవచ్చు.

Gold Monetization Scheme Eligibility Criteria :

గోల్డ్ మానిటైజేషన్ అర్హత ప్రమాణాలివే..

  • ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం కింద పేర్కొన్న వారు అర్హులుగా ఉన్నారు.
  • దేశంలోని ప్రజలు
  • ట్రస్టులు(సెబీ కింద రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్‌లు/ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు)
  • కంపెనీలు
  • స్వచ్ఛంద సంస్థలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఏదైనా ఇతర సంస్థ
  • ఉమ్మడి ఖాతాలు(అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది కలిసి ఈ స్కీమ్ కింద్ జాయింట్ డిపాజిట్లు ఓపెన్ చేయవచ్చు. బ్యాంకులు వీరు తెరిచిన జాయిట్ డిపాజిట్ అకౌంట్లలో వడ్డీలను వేస్తాయి.)

భద్రతతో పాటు ఆదాయానిచ్చే ఎస్​బీఐ గోల్డ్ స్కీం

How to Apply for Gold Monetization Scheme in Telugu :

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • మొదట మీరు మీ బంగారంతో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌ల ఏదైనా బ్రాంచ్‌కి లేదా ప్రైవేట్ పార్టనర్ బ్యాంక్‌ల నిర్దేశిత శాఖకు వెళ్లాలి.
  • అనంతరం అక్కడ GMS దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీని తర్వాత మీకు బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కౌంటర్‌ఫాయిల్ ఇవ్వబడుతుంది. అలాగే బ్యాంక్ భాగస్వామి రిఫైనర్స్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ కోఆర్డినేట్‌లకు మార్గనిర్దేశం చేస్తారు.
  • రిఫైనర్స్ ప్యూరిటీ వెరిఫికేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్ (PVC)లో మీకు కౌంటర్‌ ఫాయిల్‌ను అందిస్తారు.
  • ఆ తర్వాత మీ బంగారాన్ని టెండర్ చేయవలసి ఉంటుంది. ఆ గోల్డ్ నిజమైందేనా లేదా అని పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ తర్వాత PVC స్వచ్ఛత 995తో బంగారం పరిమాణాన్ని కలిగి ఉన్న డిపాజిట్ రశీదుని మీకు ఇస్తుంది.
  • అప్పుడు మీరు PVC రశీదుని 30 రోజులలోపు శాఖకు వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలి.
  • అనంతరం బ్రాంచ్ PVC వద్ద బంగారం స్వీకరించిన తేదీ నుంచి 30వ రోజున బంగారం డిపాజిట్‌ చేసినట్లు అకౌంట్ క్రియేట్ చేసి.. బంగారం పరిమాణం, స్వచ్ఛత, పదవీకాలం, వడ్డీ రేటు, మెచ్యూరిటీ తేదీని అందించే గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్‌ను జారీ చేస్తారు.
  • మీరు ఎంపిక చేసుకున్న టెన్యూర్ ప్రకారం మీరు ఎంపిక చేసుకున్న బ్యాంకు డిపాజిట్ చేసిన గోల్డ్‌కి వడ్డీని చెల్లిస్తుంది.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రయోజనాలు :

Gold Monetization Scheme Benefits in Telugu :

  • బంగారాన్ని సురక్షితంగా ఉంచడానికి లాకర్ ఛార్జీలు మాత్రమే చెల్లించే బదులు.. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఖాతాదారులు తమ బంగారంపై వడ్డీని పొందగలరు.
  • భాగస్వామ్య బ్యాంకు ద్వారా సురక్షితంగా ఈ స్కీమ్ నిర్వహించబడుతుంది. ప్రభుత్వం మద్దతునిస్తుంది కాబట్టి వినియోగదారులు బంగారం భద్రత గురించి హామీ ఇస్తారు.
  • ఈ పథకం కింద కస్టమర్ ఆదాయాలు.. ఏదైనా సంపద పన్ను, ఆదాయపు పన్ను లేదా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయించబడ్డాయి. ఈ మినహాయింపులో బంగారం విలువతో పాటు డిపాజిట్ స్కీమ్ నుంచి వచ్చే వడ్డీ కూడా ఉంటుంది.
  • డిపాజిటర్ పథకం కింద డిపాజిట్ చేయగల గరిష్ఠ బంగారానికి పరిమితి లేదు.
  • డిపాజిటర్లు ఈ పథకం కింద అధిక మొత్తంలో సౌలభ్యాన్ని పొందుతారు.

Udyogini Scheme for Women Entrepreneurship Benefits and Details : ఈ మహిళలకు వడ్డీ లేకుండా 3 లక్షల రుణం.. ఇలా అప్లై చేసుకోండి!

How to Generate 50K per Month from NPS : రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు పెన్షన్ .. ఈ పథకం తెలుసా..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details