2BHK Application Status in Telangana : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 2015 అక్టోబరులో రెండు పడక గదుల పథకాన్ని రాష్ట్ర సర్కారు ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇంటిలో.. రెండు బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, ఇంకా.. ఒక వంటగది, రెండు బాత్‌రూమ్‌లు ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు ఏంటి..?
Eligibility for Double Bedroom Scheme :
- డబుల్ బెడ్ రూమ్ కు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు పలు నిబంధనలు ఉన్నాయి.
- లబ్ధిదారుడు రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి.
- ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి.
- సొంత ఇల్లు లేని, అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
- శారీరక వికలాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించారు.
- గ్రామీణ ప్రాంతాల్లో.. SC, STలకు 50%.. ఇతరులకు 43%.. మైనారిటీలకు 7% కేటాయించారు.
- పట్టణ ప్రాంతాల్లో.. ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, ఇతరులకు 65% కేటాయించారు.
- కుటుంబంలోని సభ్యులెవరికీ ఇందిరా పథకం వంటి హౌసింగ్ స్కీమ్‌ల కింద ఇల్లు పొంది ఉండకూడదు.
దరఖాస్తు దారుకు అవసరమైన పత్రాలు..
Required Documents For 2BHK Application :
- డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకే వారు ఆధార్ కార్డు సిద్ధం చేసుకోవాలి.
- రేషన్ కార్డు జిరాక్సు ఉండాలి.
- ఆసరా పెన్షన్ కార్డు ఉన్నవారి ఆ జిరాక్సు తీసుకోవాలి.
- నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- ఒక పాస్ పోర్ట్ సైజు ఫొటో
KTR on Double Bedroom Houses : 'ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ'
ఆన్ లైన్ లో సొంతంగా దరఖాస్తు..
How to Apply for 2BHK in Online :
- ఆన్‌లైన్‌లో డబుల్ ఇంటి కోసం సొంతంగా దరఖాస్తు చేయాలంటే.. ముందుగా మీ సమీప గ్రామసభ లేదంటే.. మీసేవా కేంద్రాన్ని సందర్శించాలి.
- అక్కడ ఆపరేటర్ ను సంప్రదిస్తే.. దరఖాస్తు ఫారమ్ ఇస్తారు. లేదంటే.. మీ ఫోన్ కు ఒక లింక్ పంపిస్తారు. దాన్నుంచి ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత.. ఆ ఫామ్ ను పూర్తి వివరాలతో ఫిల్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫామ్ నింపిన తర్వాత.. ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి.. సమీపంలోని గ్రామసభ లేదా మీసేవా కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత.. మీరు సబ్మిట్ చేసినట్టుగా ఓ రిఫరెన్స్ ఇస్తారు. దాన్ని భద్రంగా దాచుకోవాలి.