తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Apply for Aasara Pension : ఆసరా పింఛన్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..? - ఆసరా పింఛన్ అర్హతలు ఏంటి

How to Check Aasara Pension Status : తెలంగాణలో ఆసరా పింఛన్ కనిష్టంగా 2,016 నుంచి గరిష్టంగా 4,016 రూపాయల వరకు అందుతోంది. "ఆసరా" పేరుతో పలు వర్గాల వారిని ప్రభుత్వం ఆదుకుంటోంది. మరి, ఏ కేటగిరీ వారికి ఈ పింఛన్ అందుతోంది? ఎలా అప్లై చేయాలన్నది చూద్దాం.

How to Check Aasara Pension Status
How to Apply for Aasara Pension

By

Published : Aug 19, 2023, 1:14 PM IST

Aasara Pension in Telangana : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ.1000 వరకు, దివ్యాంగుల పింఛన్ రూ.500 నుంచి రూ.1,500 వరకు పెంచింది. ఆ తర్వాత రెండవసారి కూడా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ.. మరోసారి పింఛన్లను పెంచింది. వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, దివ్యాంగుల పింఛన్ రూ.1,500 నుంచి రూ. 3,016కు పెంచింది. ఇటీవల.. దివ్యాంగుల పింఛన్​ను మరోసారి పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వీరికి 4,016 రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గత నెలలో ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. మరి, ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పింఛన్ల ద్వారా ఎవరెవరు ఎంత అందుకుంటున్నారు? ఆసరా పింఛన్​కు ఉండాల్సిన అర్హతలు ఏంటి..? ఎలాంటి పత్రాలు కావాలి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

ఆసరా పింఛన్.. ఎవరెవరికి ఎంతంటే..?

How Much Pension :

  • దివ్యాంగులకు రూ.4,016
  • ఒంటరి స్త్రీలకు రూ.2016
  • బీడీ కార్మికులకు రూ.2016
  • ఫైలేరియా రోగులకు రూ.2016
  • హెచ్‌ఐవీ రోగులకు రూ.2016
  • వృద్ధాప్య పింఛన్ రూ.2016
  • వికలాంగ వ్యక్తికి రూ.2016
  • చేనేత కార్మికులకు రూ.2016
  • వితంతువులకు రూ.2016

ఆ మార్గదర్శకాల్లో సవరణ.. 57 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛన్

ఆసరా పింఛను అర్హతలు..

Eligibility for Aasara Pension :

  • 65 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు.
  • వితంతువు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
  • చేనేత, బీడీ మొదలైన కార్మికుల వయస్సు 50 ఏళ్లు పైబడి ఉండాలి.
  • వికలాంగులు ఏ వయసు వారైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారుడు సమర్పించాల్సిన పత్రాలు..

Which Documents Need For Aasara Pension :

  • ఆధార్ కార్డ్
  • ఇంటి చిరునామా పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • వయస్సు రుజువు పత్రం
  • వితంతువైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  • చేనేత, బీడీ కార్మికులు.. సహకార సంఘం రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ
  • బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతా
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
  • మొబైల్ నంబర్

వయసు పైబడిన రైతులకు రూ.3000 పింఛన్​.. అర్హతలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి?

ఆఫ్‌లైన్‌లో ఆసరా దరఖాస్తు చేసే విధానం..

How To Apply for Aasara Pension in Off line :

ముందుగా దరఖాస్తుదారుడు పింఛన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.aasara.telangana.gov.in/ నుంచి దరఖాస్తు ఫామ్​ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అడిగిన సమాచారాన్ని నింపాలి. పైన చెప్పిన విధంగా.. అర్హతా పత్రాలన్నీ జతచేయాలి. అనంతరం.. గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారికి సమర్పించాలి.

పింఛన్ స్టేటస్ తెలుసుకోవటం ఎలా..?

How To Know Aasara Pension Status in Online :

లబ్ధిదారులు తమ పింఛన్ వివరాలను తెలుసుకోవాలంటే.. ముందుగా https://www.aasara.telangana.gov.in/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. దీంతో స్క్రీన్‌పై హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత "పెన్షనర్ వివరాలు" ఆప్షన్ ఎంపిక చేసుకుని.. ఐడీ నెంబర్, జిల్లా, మండలం, గ్రామ పంచాయితీ పేరు, పేరు నమోదు చేసి క్లిక్ చేయాలి. దీంతో.. పింఛన్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానం..

How To Apply for Aasara Pension in Online :

https://www.aasara.telangana.gov.in/ అధికారిక వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసునే అవకాశం గతేడాది సెప్టెంబర్​ వరకూ కల్పించారు. ఆ తర్వాత నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించట్లేదు. దీంతో.. కార్యాలయాల చుట్టూ తిరగలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదేందయ్యా ఇది.. పింఛన్‌లో చెత్త పన్ను కోతేంటి..?

బతికే ఉన్నామని చెప్పేందుకు.. పెన్షన్‌దారుల తంటాలు

ABOUT THE AUTHOR

...view details