How to Add and Share Boarding Pass in DigiYatra App in Telugu : విదేశాలకు లేదా దేశంలోని ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఫ్లైట్ జర్నీకి ఆసక్తి చూపుతుంటారు. అయితే సాధారణంగా మనం విమానాశ్రయాల్లో విమానం(Flight) ఎక్కే ముందు వరకు ఎన్నో తనిఖీలు ఉంటాయి. లగేజ్ దగ్గర నుంచి టికెట్ వరకు అడుగడుగున చెకింగ్ చేస్తుంటారు. ఇందుకోసం ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ చెకింగ్ పాయింట్ల వద్ద టికెట్ లేదా బోర్డింగ్ పాస్ పట్టుకొని పెద్ద ఎత్తున క్యూలైన్లు కడుతుండేవారు. దాంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 'డిజియాత్ర యాప్'ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
DigiYatra App Latest Update : 'డిజియాత్ర యాప్'(DigiYatra App)ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా విమాన ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు కేవలం 10 నిమిషాల్లోనే విమానం ఎక్కేముందు తనిఖీ చేసే చర్యలన్నీ పూర్తి అయిపోతున్నాయి. డిజియాత్ర యాప్ విమాన బోర్డింగ్ సమస్యలను చాలా వరకు తగ్గించింది. కానీ, ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కూడా చాలా మంది వినియోగదారులు ఈ యాప్ నుంచి బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయలేక విమానాశ్రయాల వద్ద అధికారులు చెక్-ఇన్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారి కోసం డిజియాత్ర యాప్‌లో బోర్డింగ్ పాస్ యాడ్ చేయడానికి, షేర్ చేయడానికి మేము ఈ స్టోరీలో 3 ఉత్తమ మార్గాలు అందిస్తున్నాం. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
డిజియాత్ర యాప్‌లో బోర్డింగ్ పాస్‌ను ఎలా ఉపయోగించాలంటే..
How to Use Boarding Pass in DigiYatra App : DigYatra యాప్‌లో బోర్డింగ్ పాస్‌ను యాడ్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. దీన్ని సులభంగా చెక్-ఇన్ చేయడానికి ఉపయోగించవచ్చు. డిజియాత్ర యాప్‌ని ఉపయోగించి చెక్ ఇన్ చేయడానికి మీరు ముందుగా బోర్డింగ్ పాస్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాప్‌లో బోర్డింగ్ పాస్‌ను యాడ్ చేసే 3 ఉత్తమ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Add Boarding Pass in DigiYatra use Scan Boarding Pass :
డిజియాత్ర యాప్‌లో బోర్డింగ్ పాస్‌ని స్కాన్ చేసే ప్రక్రియ..
- మొదట మీ ఫోన్‌లో DigiYatra యాప్‌ను ప్రారంభించాలి. ఆ తర్వాత ఎగువ కుడివైపున ఉన్న ప్లస్ ఐకాన్‌పై నొక్కాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో Scan Boarding Pass అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ బోర్డింగ్ పాస్ QR కోడ్ స్ట్రిప్‌ను మీ ఫోన్‌తో స్కాన్ చేయాలి.
- డిజియాత్రయాప్‌నకి బోర్డింగ్ పాస్ యాడ్ చేసిన తర్వాత.. ఎయిర్‌పోర్ట్ అథారిటీతో ఆధారాలను షేర్ చేయడానికి share బటన్‌పై నొక్కాలి.
- షేర్ చేసిన తర్వాత మీరు QR కోడ్‌ని నొక్కి, సులభంగా చెక్-ఇన్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ గేట్ వద్ద స్కాన్ చేయవచ్చు.