రణభేరి మోగింది సబర్మతిలో. కానీ బ్రిటిష్ వాళ్ల వెన్నులో చలిపుట్టించింది, స్వాతంత్ర్యోద్యమానికి (Indian independence movement) కాకపుట్టించింది మాత్రం ఆ పుణ్య ధామమే. అదే సేవాగ్రామ్(gandhi sevagram ashram). సబర్మతి నుంచి దండి మార్చి ప్రారంభించిన గాంధీజీ(Gandhi Jayanti).. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే సబర్మతిలో తిరిగి అడుగుపెడతానని శపథం చేశారు. మరి అందాకా మహాత్ముడు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిహితులు ఎంపిక చేసిన ఆశ్రమమే సేవాగ్రామం(sevagram ashram wardha). క్విట్ ఇండియా రణనినాదంతో దేశవ్యాప్త ఉద్యమానికి ఊపిరి ఊదిన సేవాగ్రామ్ పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
గాంధీజీ(Gandhi Jayanti) సబర్మతి ఆశ్రమం(sabarmati ashram) నుంచి దండి యాత్రకు(dandi march) బయలుదేరినప్పుడు ఒక శపథం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా తిరిగి సబర్మతిలో అడుగు పెట్టేది లేదని నిర్ణయించారు. దండి యాత్ర సందర్భంలో బ్రిటిషర్లు గాంధీని అరెస్టు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత గాంధీని విడుదల చేశారు. అప్పుడు బయటకు వచ్చిన గాంధీజీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక గ్రామాన్ని స్వాతంత్ర్యోద్యమానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు.
"స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించాలని నిశ్చయించారు. స్వాతంత్ర్యం సిద్ధించేదాకా సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టకూడదన్నది ఆయన నిర్ణయం. మరి గాంధీజీ ఎక్కడ ఉండాలి? అనే అంశంపై ఆయన అనుయాయులు చర్చించారు. అప్పుడు జమ్నాలాల్ బజాజ్ వార్ధాలో ఓ ప్రదేశాన్ని చూపించారు. ఆ ప్రదేశ ప్రాముఖ్యతను గాంధీజీకి చెప్పి ఒప్పించారు."
- డా. శివచరణ్ ఠాకూర్, నయి తాలిమ్, సేవాగ్రామ్ ఆశ్రమం
జమ్నాలాల్ బజాజ్ అభ్యర్ధనతో గాంధీజీ నేడు వార్ధాగా ప్రాచుర్యం పొందిన నాటి పాలక్ వాడీలో అడుగుపెట్టారు. మొదటి సత్యాగ్రహి ఆశ్రమంలో ఆయన బసచేశారు. 1935 జనవరిలో గాంధీ మాగన్ వాడీలో గడిపారు. అదే సమయంలో మీరాబెన్ కోసం ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసే బాధ్యతను గాంధీజీ అనుయాయులకు అప్పగించారు.
ఆది నివాస్..
మహాత్మా గాంధీ 1936 ఏప్రిల్ 30న తొలిసారి సేవాగ్రామ్ ఆశ్రమంలో(gandhi sevagram ashram) అడుగు పెట్టారు. అంతకు ముందు ఏప్రిల్ 17న ఆయన షెహగాన్ గ్రామవాసులను సేవాగ్రామ్ వద్ద కలుసుకున్నారు. ఆయన తొలిసారి అంటే..ఏప్రిల్ 30న అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఉండేదుకు గుడిసె కూడా లేదు. ఆ సమయంలో గాంధీజీ ఆ సమీపంలోని జామతోట బావి దగ్గర ఓ గుడిసెలో బస చేశారు. ఇక్కడ ఆయన ఐదేళ్లు ఉన్నారు. అప్పుడు గాంధీ(Gandhi Jayanti) అక్కడ ఓ కుటీరాన్ని సిద్ధం చేయాలని జమ్నాలాల్ బజాజ్‌ను కోరారు. ఆ కుటీరం ఒక సామాన్యుడి ఇంటిలా ఉండాలని సూచించారు. గుడిసె నిర్మాణ వ్యయం వంద రూపాయలు మించరాదని షరతు విధించారు. స్థానిక వనరులను ఉపయోగించి, అక్కడి వారి సహాయంతో నిర్మించాలని సూచించారు. ఆ తరువాత 1936 మే 5న గాంధీజీ ఖాదీయాత్రకు బయలుదేరారు.