తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రచారాల కోసం రూ.కోట్లు ఖర్చు.. ఎన్నికల సంఘం నివేదిక.. ఏ పార్టీ లెక్క ఎంతంటే? - ప్రకటనలు ప్రచారాల కోసం భారాస ఎంత ఖర్చు చేసింది

వివిధ పార్టీలు ప్రకటనలు, ప్రచారాల కోసం చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందులో భాజపా అత్యధికంగా ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్​ నిలిచింది. మిగితా పార్టీల వివరాలు ఇలా..

political parties expenditure on campaign  and publicity
political parties expenditure on campaign and publicity

By

Published : Jan 28, 2023, 5:22 PM IST

Updated : Jan 28, 2023, 6:48 PM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రకటనలు, ప్రచారానికి రూ. 300 కోట్లకుపైగా ఖర్చు చేసింది. దేశంలోని అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి రాజకీయపార్టీలు పంపిన వార్షిక నివేదికల ఆధారంగా.. ఖర్చు వివరాలను విడుదల చేసింది. కాంగ్రెస్, సీపీఎమ్​లు ఖర్చుల లెక్కలు సమర్పించలేదని.. ఎన్​సీపీ, సీపీఐసహా మరికొన్ని పార్టీలు ప్రకటనలు, ప్రచారానికి పైసా ఖర్చు చేయలేదని ఈసీ పేర్కొంది.

రాజకీయ పార్టీల వార్షిక ఆడిట్ నివేదికల ఆధారంగా..కేంద్ర ఎన్నికల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలోని వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమర్పించిన వివరాల ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ నివేదిక వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారం, ప్రకటనల కోసం దేశంలోని అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భాజపా ప్రకటనలు, ప్రచారానికి రూ. 313.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అందులో 75శాతం ఎన్నికలు, సాధారణ ప్రచారానికి వెచ్చించినట్లు పేర్కొంది.

ప్రకటనల కోసం రూ. 164 కోట్లు, ఆడియో, వీడియోల కోసం రూ. 18.41 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాకోసం రూ. 72.28కోట్లు ఖర్చు చేసింది. కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లకు మరో రూ. 36.33 కోట్లు, కరపత్రాల కోసం రూ. రూ. 22.12 కోట్లు వెచ్చించినట్లు ఈసీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ వార్షిక వ్యయంలో 37 శాతం ప్రకటనలు, ప్రచారానికే ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది.

తమిళనాడులోని అధికార డీఎమ్​కే.. ప్రకటనలు, ప్రచారానికి కోసం రూ. 35.40 కోట్లు వ్యయం చేసింది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 97శాతమని ఈసీ పేర్కొంది. ప్రతిపక్ష అన్నాడీఎమ్​కే కూడా ప్రచారం, ప్రకటనల కోసం రూ. 28.43 కోట్లు ఖర్చు చేసిందని ఈసీ పేర్కొంది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 78శాతమని తెలిపింది. కేజ్రివాల్ సారథ్యంలోని ఆప్‌.. 2021-22లో ప్రకటనలు, ప్రచారానికి రూ. 30.29 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ ఖర్చులో.. అది 46శాతమని ప్రకటించింది.

మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్.. ప్రకటనలు, ప్రచారం కోసం రూ. 28.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈసీ తెలిపింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్​పీ రూ. 13.83కోట్లు, నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ రూ. 16 కోట్లు, ఎస్పీ రూ. 7.56కోట్లు, తెలంగాణలోని భారాస రూ. 7.12 కోట్లు, తెలుగుదేశం పార్టీ రూ. 1.66 కోట్లు ప్రచారం, ప్రకటనల కోసం వెచ్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నితీశ్‌ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న జేడీయూ రూ. 36.82 లక్షలు వెచ్చించినట్లు తెలిపింది. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్​జేడీ రూ. 33వేలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికల ప్రకారం ఎన్​సీపీ, వైకాపా, సీపీఐలు ప్రకటనలు, ప్రచారానికి ఖర్చు చేయలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే కాంగ్రెస్‌, సీపీఎమ్​లు వార్షిక ఖర్చు వివరాలు అందజేయలేదని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ.. రూ. 279.73 కోట్లు, సీపీఎమ్​ పార్టీ రూ. 83.41 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

Last Updated : Jan 28, 2023, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details