తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - టుడే రాశి ఫలాలు తెలుగు

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

how is my horoscope today
రాశిఫలం

By

Published : Aug 3, 2021, 4:40 AM IST

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

మేషం

మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తోంది. కీలకమైన పనుల్లో బాగా అలోచించి ముందడుగు వేయాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.

వృషభం

ఆదాయమార్గాలు పెంచడానికి ప్రణాళికలు రచిస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం.

మిథునం

శుభ సమయం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. చంద్ర ధ్యానం శుభాన్నిస్తుంది.

కర్కాటకం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

సింహం

శుభకాలం. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బుద్ధిబలంతో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్ట దైవారాధన మంచిది.

కన్య

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఆపదలు తొలగడానికి వేంకటేశ్వరుడిని పూజించాలి.

తుల

అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనసుకు బాధ కలిగిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

వశ్చికం

కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గురుశ్లోకం చదవాలి.

ధనస్సు

ఉద్యోగులకు శుభకాలం. ఉద్యోగంలో స్వస్థాన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహార విశ్రాంతులు తీసుకోవాలి. బంధువులతో వాదోపవాదాలు చేయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

మకరం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూలమైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే మంచిది.

కుంభం

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. బంధువైరం సూచితం. శివ స్తోత్రం పఠించడం మంచిది.

మీనం

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. రవి ధ్యానం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details