తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పది నెలల పసికందుపై.. పనిమనిషి చిత్రహింసలు

అభం శుభం తెలియని చిన్నారిని చిత్రహింసలు పెట్టింది పనిమనిషి. ఆ 10 నెలల పసికందు ఏడుస్తున్నా కనికరం చూపలేదు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఇది గమనించిన పాప తల్లిదండ్రులు.. ఆ మహిళపై ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేశారు.

Housemaid arrested for torturing 10- month old child
పసికందుపై పనిమనిషి చిత్రహింసలు, బంగాల్​ వార్తలు

By

Published : Oct 2, 2021, 6:20 PM IST

పసికందుపై కర్కశంగా దాడి

బంగాల్​ తూర్పు మిద్నాపుర్​లోని పాంస్​కుడా ప్రాంతంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ 10 నెలల పసికందును పనిమనిషి చిత్రహింసలకు గురిచేసింది. కొడుతూ, కిందకు విసిరేస్తూ కనికరం లేకుండా వ్యవహరించింది.

వివరాల్లోకి వెళ్తే.. పాంస్​కుడాకు చెందిన డా. దేబాశిష్​ బాంకురాలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆమె భార్య నాబమిత భట్టాచార్య కూడా జిల్లా ప్రజారోగ్య శాఖ ఉన్నతోద్యోగి​. విధుల్లో తీరిక లేకుండా ఉంటున్న కారణంగా.. వారి 10 నెలల కూతురును చూసుకునేందుకు కల్పనాసేన్​ అనే 50 ఏళ్ల మహిళను పనిమనిషిగా నియమించుకున్నారు.

చిన్నారిపై చిత్రహింసలు

ఆ మహిళ.. తమ పాపను సరిగా చూస్తుందో లేదో అనే అనుమానంతో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న సమయంలోనే.. ఓసారి తన ఫోన్​లో ఫుటేజీని పరిశీలించారు దేబాశిష్​. చిన్నారిని పనిమనిషి కొడుతున్న దృశ్యాలు కంటపడ్డాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషి తన నేరం అంగీకరించింది.

ఇదీ చూడండి: ముఖంపై 8 కేజీల కణతి.. 16 సర్జరీలు చేసి చివరకు...

ABOUT THE AUTHOR

...view details