భారత్-చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సైనికుల అత్యవసర సంభాషణకు వీలుగా 'హాట్‌లైన్' ఏర్పాటైంది. గతకొన్నాళ్లుగా సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో చర్చలు ప్రారంభించిన ఇరుదేశాలు సిక్కింలో ఈ హాట్‌లైన్ ఏర్పాటుకు అంగీకరించాయి. భారత్-చైనాల కమాండర్ల స్థాయిలో కమ్యూనికేషన్ కోసం ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ హాట్‌లైన్ ఏర్పాటుతో సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని భావిస్తున్నారు.
ఉత్తర సిక్కింలోని కొంగ్రాలాలోని భారత సైన్యం-టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ఖంబాజోంగ్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య ఈ హాట్‌లైన్ ఉండనుంది. తూర్పు లద్దాక్‌లో ఘర్షణపూరిత వాతావరణంతో ఇరుదేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలో ఈ హాట్‌లైన్ ఏర్పాటు కావడం విశేషం.