తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాంబార్​ ఫ్రీగా ఇవ్వలేదని జరిమానా- పోలీసులపై ఫిర్యాదు! - సాంబార్​ గొడవలో పోలీసులు

సాంబార్‌ ఉచితంగా ఇవ్వలేదని హోటల్‌ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు ఓ కానిస్టేబుల్​. ఆ మరుసటి రోజు ఎస్​ఐతో కలిసి వచ్చి కొవిడ్​ నిబంధనల ఉల్లంఘన పేరుతో రూ.5,000 జరిమానా విధించాడు. ఈ వ్యవహారంతో పోలీసుల తీరుపై అసంతృప్తి చెందిన హోటల్​ యజమాని.. ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

sambar
సాంబార్‌ ఫ్రీగా ఇవ్వలేదని రూ.5,000 జరిమానా

By

Published : Apr 14, 2021, 9:10 AM IST

Updated : Apr 14, 2021, 9:54 AM IST

సాంబార్‌ ఉచితంగా ఇవ్వలేదని ఒక హోటల్‌కు పోలీసులు రూ.5,000 జరిమానా విధించడం తమిళనాడులోని కాంచీపురంలో వివాదానికి దారితీసింది. గత శుక్రవారం.. కాంచీపురం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న హోటల్‌కు వెళ్లిన ఒక కానిస్టేబుల్‌.. సాంబార్‌ ఉచితంగా ఇవ్వాలని కోరాడు. అందుకు హోటల్‌ నిర్వాహకులు నిరాకరించగా.. వారికి, కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.

కాంచీపురంలోని హోటల్​

కానిస్టేబుల్​ సూచనతో ఎస్​ఐ..

శనివారం ఆ ప్రాంతానికి చెందిన ఎస్‌ఐ రాజమాణికమ్, కానిస్టేబుల్‌తో కలిసి.. హోటల్‌కు వెళ్లి కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదని రూ.500 జరిమానా విధించారు. కానిస్టేబుల్‌ జోక్యం చేసుకుని రూ.5,000 జరిమానా వేయాలని ఎస్‌ఐకి సూచించాడు. కానిస్టేబుల్ సూచన మేరకు కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కింద రూ.5వేలు జరిమానా విధించారు ఎస్​ఐ.

పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన హోటల్ యజమాని.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్​ఐ, కానిస్టేబుల్​
జరిమానా పత్రం

ఇదీ చూడండి:మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం

Last Updated : Apr 14, 2021, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details