గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. గతంలో బరాక్ ఒబామాను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లుగానే.. సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులను కూడా పిలిపించి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పెద్ద మనసుతో.. రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతుల గోడు పట్టించుకోవాలన్నారు.
"రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ప్రధాని రైతులను తన ఇంటికి పిలిచి టీ ఇచ్చి.. సాగు చట్టాలను రద్దు చేస్తానని చెప్పాలి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు. పేదరికం నుంచి వచ్చానని చెప్పుకునే మోదీ.. రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలి."
----అసదుద్దీన్ ఓవైసీ,
ఏఐఎమ్ఐఎమ్ అధినేత