తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం - కేసీ వేణు గోపాల్

పని ప్రదేశంలో మలయాళ భాష మాట్లాడవద్దని ఓ దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలు జారీ చేసింది. హిందీ లేదా ఆంగ్లం మాత్రమే మాట్లాడాలని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుంది.

nurses ordered to use English Hindi
కేరళ నర్సులు

By

Published : Jun 6, 2021, 12:14 PM IST

మలయాళ భాషకు సంబంధించి దిల్లీ జిప్​మెర్​ జారీ చేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. నర్సులు.. పని ప్రదేశంలో మలయాళం మాట్లాడకూడదని.. హిందీ లేదా ఇంగ్లీష్​నే వాడాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన కారణంగా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ఆసుపత్రి.

ఎందుకు ఈ నోటీసులు..

"ఎక్కువ మంది రోగులు, సిబ్బందికి మలయాళం రాదు. దీంతో వారు నిస్సహాయులుగా భావించడం మూలంగా చాలా అసౌకర్యం కలుగుతోంది" అని జిప్​మెర్​ వివరించింది. మలయాళ భాషపై ఓ రోగి చేసిన ఫిర్యాదు మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది.
కానీ ఉత్తర్వులపై తీవ్ర వ్యక్తిరేకత ఎదురైన కారణంగా వాటిని ఉపసంహరించుకుంది.
అప్పటికే ఈ వ్యవహారంపై రాజకీయంగా చర్చనీయాశమైంది. జిప్​మెర్​ ఆదేశాలపై నర్సింగ్​ సంఘాలు, రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆసుపత్రి చర్యను దుయ్యబట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
రాహుల్ ట్వీట్

"దేశంలోని ఇతర భాషల్లాగే మలయాళం కూడా భారతీయ భాషే. భాష పరమైన వివక్షను ఆపండి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రాజ్యంగ విరుద్ధం..

అనాగరిక, రాజ్యాంగ విరుద్ధ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ను కోరారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణు గోపాల్.

కేసీ వేణుగోపాల్ ట్వీట్

"ప్రపంచవ్యాప్తంగా రోగుల క్షేమం కోసం కేరళ నర్సులు పనిచేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందినవారు వారిలో వారు మాతృభాషలో మాట్లాడతారు. భాష తెలియనివారితోనూ మలయాళంలోనే మాట్లాడతారని అనుకోవడంలో అర్థం లేదు. ఈ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా, వివక్షపూరితం."

- కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీ

మానవ హక్కుల ఉల్లంఘన..

శశి థరూర్ ట్వీట్

"భాష అర్థమయ్యే వారితో తమ మాతృభాషలో మాట్లాడవద్దని ప్రజాస్వామ్య భారత్​లో ఓ ప్రభుత్వ సంస్థ చెప్పడం విడ్డూరం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆదేశాలు భారత పౌరుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి," అని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

హిందీ భాష అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం

'అన్ని రాష్ట్రాల్లో హిందీ' పై నిర్ణయం తీసుకోలేదు: జైశంకర్​

'ఐ డోంట్​ నో హిందీ డ్యూడ్' టీషర్టులకు భారీ క్రేజ్​

ABOUT THE AUTHOR

...view details