పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ద్వాదశ చంద్రస్థితి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. చేయని తప్పునకు నిందపడాల్సి వస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లలితాదేవి ఆరాధన శుభదాయకం.
మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమా మహేశ్వరస్తోత్రం చదివితే మంచిది.
మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. దుర్గాదేవిని ఆరాధించాలి.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.