Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? (20-06-2022) - రాశిఫలాలు
Horoscope Today (20/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
HOROSCOPE TODAY
By
Published : Jun 20, 2022, 4:24 AM IST
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. విందు వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేస్తే మంచిది.
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రము పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ మంచినిస్తుంది.
మంచి కాలం. మీ పనితీరుతో మీపై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రము పఠిస్తే మంచిది.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.
మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. మీకు నచ్చినవారితో ఇష్టమైన వారితో ఆనందకర క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆంజనేడిని ఆరాధిస్తే మంచి జరగుతుంది.
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
చక్కటి పనితీరు కనబరుస్తారు. మీపై అధికారుల మనసులు గెలిచి గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో జాగ్రత్త. విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. విష్ణు నామస్మరణ వల్ల మంచి జరుగుతుంది.
స్థిరమైన చిత్తంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు ఉన్నాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో మాటపట్టింపులకు పోవడం మంచిదికాదు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.