తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? (16/06/2022)

Horoscope Today (16/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope today
Horoscope today

By

Published : Jun 16, 2022, 5:42 AM IST

Horoscope Today(16/06/2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మిశ్రమకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం చదవాలి.

ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది.

ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ముఖ్య వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

మీ నిబద్ధతే మీ విజయానికి మూలం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ మంచిది.

మనఃస్సౌఖ్యం కలదు. మీ బుద్ధిబలంతో పనులను పూర్తిచేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. కులదైవ సందర్శనం శుభప్రదం.

ఇష్టసిద్ది ఉంది. ముఖ్య వ్యవహారాలలో, విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యవిషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శివస్తోత్రం చదవడం మంచిది.


ABOUT THE AUTHOR

...view details