Horoscope: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/06/22) - etv horoscope today
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
today horoscope
By
Published : Jun 11, 2022, 4:33 AM IST
Daily Horoscope: డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఈ రోజు రాశిఫలాలపై ఏం చెప్పారంటే..
మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పని పెద్దలను మెప్పిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభకరం.
ప్రశాంత చిత్తంతో పనులను చేయండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం మంచిది.
శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. శివపంచాక్షరి జపించాలి.
ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. నవగ్రహ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.
ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బంది పడతారు. కొన్ని పరిస్థితులు మానసిక అసంతృప్తిని కలిగిస్తాయి. సూర్యగ్రహ ధ్యానం మంచిది.
మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.
ప్రారంభించబోయే పనులలో బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.