Horoscope Today(08-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
మేషం:
కార్యానుకూలత ఉంది. సంఘటనలు ఉత్సాహాన్నిఇస్తాయి. అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. శ్రీవిష్ణు దర్శనం శుభప్రదం.
వృషభం:
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బద్ధకించకుండా పనిచేస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సహనాన్ని కోల్పోకండి. గోసేవ మేలు చేస్తుంది.
మిథునం:
నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది.
కర్కాటకం:
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
సింహం:
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ వల్ల మంచి జరుగుతుంది.
కన్య:
బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.