తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today(1-02-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today(01-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Feb 1, 2022, 4:15 AM IST

Horoscope Today(01-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలాలను ఇస్తుంది.

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాష్టకం చదివితే మంచిది.

కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. మనః సౌఖ్యం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.

ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.

ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో లాభం చేకూరుతుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిది.

తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details