Horoscope Today(30-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
మేషం...
చేపట్టే పనుల్లో పట్టుదల వీడకండి. లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబసభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
వృషభం...
ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
మిథునం..
చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
కర్కాటకం...
తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందువినోదా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
సింహం..
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్దిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి చదవాలి.
కన్య..
సమన్వయ లోపం లేకుండా చూచుకోవాలి. సమర్ధతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి వేంకటేశ్వర సందర్శించాలి.