Horoscope Today(27-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
మేషం...
మీలోని పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.
వృషభం...
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు,మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.
మిథునం..
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి,మంచి జరుగుతుంది.
కర్కాటకం...
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
సింహం..
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కన్య..
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి దర్శనం శుభప్రదం.
తుల..
ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనః స్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
వృశ్చికం..
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనస్సు..
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం.ఇష్టదేవతా దర్శనం ఉత్తమం.
మకరం...
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. కొన్నిపరిస్థితులు బాధ కలిగిస్తాయి. శని శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
కుంభం..
శుభకాలం. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. తప్పుదోవ పట్టించేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు సఫలం అవుతాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.
మీనం..
చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:'పంజాబ్ సీఎం అభ్యర్థిని నిర్ణయించేది కార్యకర్తలే'