తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2021, 4:48 AM IST

ETV Bharat / bharat

Horoscope Today (20-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

Horoscope Today: ఈరోజు (20-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం;

బహుళ పక్షం పాడ్యమి: ఉ. 10.47 తదుపరి విదియ ఆర్ద్ర: సా. 6.39 తదుపరి పునర్వసు

వర్జ్యం: లేదు

అమృత ఘడియలు: ఉ.7.36 నుంచి 9.32 వరకు

దుర్ముహూర్తం: మ. 12.18 నుంచి 1.02 వరకు తిరిగి 2.30 నుంచి 3.14 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.28

సూర్యాస్తమయం: సా.5-26

మేషం

ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ్‌ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. తోటి వారిని కలుపుకుపోవడంవల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.

మిథునం

శుభకాలం. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

పట్టుదలతో పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటి విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్ఠకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

అనుకూలమైన కాలం. ఉద్యోగంలో పెద్దల ఆశిస్సులు లభిస్తాయి. కీర్తి కోసం శ్రమిస్తారు. గృహానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది.

కన్య

ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

తుల

మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబందించిన శుభవర్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

ధనుస్సు

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.

మకరం

అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

కుంభం

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం మేలుచేస్తుంది.

మీనం

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 19 - డిసెంబర్‌ 25)

ABOUT THE AUTHOR

...view details