తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (19-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈనాడు రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
రాశిఫలాలు

By

Published : Dec 19, 2021, 5:09 AM IST

Horoscope Today: ఈరోజు (18-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం;శుక్లపక్షం

పూర్ణిమ: ఉ. 8.40 తదుపరి బహుళ పాడ్యమి;

మృగశిర: సా. 4.09 తదుపరి ఆర్ద్ర;

వర్జ్యం: రా. 1.25 నుంచి 3.11 వరకు;

అమృత ఘడియలు: ఉ. 8.10 వరకు;

దుర్ముహూర్తం: సా. 3.58 నుంచి 4.42 వరకు;

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.28, సూర్యాస్తమయం: సా.5-26

మేషం

ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసే వారున్నారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.

వృషభం

మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.

మిథునం

ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటకం

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్ర బలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం.

సింహం

మొదలుపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవము పారాయణ చేయడం మంచిది.

కన్య

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచింది.

తుల

శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృశ్చికం

కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకుపోవడం మంచిది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. గణపతి ఆరాధనా శుభప్రదం.

ధనుస్సు

చేపట్టేపనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రమేయం లేని వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మకరం

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

కుంభం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు కాస్త ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. గోసేవ చేయడం మంచిది.

మీనం

మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. లక్ష్మీ దేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 12 - డిసెంబర్‌ 18)

ABOUT THE AUTHOR

...view details