తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (12-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope today telugu,

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలం

By

Published : Dec 12, 2021, 5:35 AM IST

Horoscope Today: ఈరోజు (12-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం; శుక్లపక్షం

నవమి:రా. 12.00 తదుపరి దశమి

ఉత్తరాభాద్ర:తె. 4.11 తదుపరి రేవతి

వర్జ్యం:మ. 1.27 నుంచి 3.06 వరకు

అమృత ఘడియలు:రా. 11.17 నుంచి 12.55 వరకు

దుర్ముహూర్తం:సా. 3.55 నుంచి 4.39 వరకు

రాహుకాలం:సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.24, సూర్యాస్తమయం: సా.5-23

మేషం

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

వృషభం

ఇష్ట కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మంచిది.

మిథునం

మొదలు పెట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ మనసు చెప్పిన ప్రకారం నడుచుకుంటే శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కర్కాటకం

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పుదోవ పట్టించేవారితో జాగ్రత్తగా ఉండాలి. చంచల బుద్ధితో సమస్యలు వస్తాయి. నిద్రాహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆంజనేయ సోత్రం పారాయణ చేయాలి.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

కన్య

విశేషమైన శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్దిబలం బాగుంటుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలసివస్తాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

తుల

అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఇష్ట దైవారాధన వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చికం

ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగితే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శని ధ్యానం మంచినిస్తుంది

ధనుస్సు

మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి.

మకరం

ధనలాభం కలదు. వ్యాపారంలో ఆర్థికవృద్ధిని సాధిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతనంగా పనులు చేపట్టేవారు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచింది.

కుంభం

అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వివాదాల్లో తలదూర్చకండి. మంచి మనసుతో ముందుకు సాగితే కష్టాలు తగ్గుతాయి. ఇష్ట దైవాన్ని సందర్శిస్తే మంచిది.

మీనం

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యానం చేయాలి.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 12 - డిసెంబర్‌ 18)

ABOUT THE AUTHOR

...view details