తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ రోజు(25-06-2022) రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలం

Horoscope Today (25/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలం

By

Published : Jun 25, 2022, 5:02 AM IST

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; బహుళపక్షం ద్వాదశి: రా.1-54 తదుపరి త్రయోదశి భరణి: మ. 12-15 తదుపరి కృత్తిక వర్జ్యం: రాత్రి 1-07 నుంచి 2-50 వరకు అమృత ఘడియలు: ఉ. 7-12 నుంచి 8-53 వరకు దుర్ముహూర్తం: ఉ.5-31 నుంచి 7-15 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.5.31, సూర్యాస్తమయం: సా.6.34

కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారరంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. దైవబలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

శుభఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.

ABOUT THE AUTHOR

...view details