తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 23) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Nov 23, 2022, 6:30 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 23) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

అనుకున్న సమయంలోలక్ష్యాలను చేరుకోడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు.ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.శివారాధన శుభప్రదం.

మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

నిర్ణీతకాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్యనమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. వ్యయంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. మీ చుట్టూ గిట్టనివాళ్లు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. చంద్రధ్యానం శుభప్రదం.

మీ వినయవిధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.

మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్యసాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురుధ్యానం మంచిది.

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. దుర్గారాధన శుభప్రదం.

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details