Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలాలు చూసుకున్నారా? - telugu panchangam
Horoscope Today : ఈ రోజు (మే 3) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today
By
Published : May 3, 2023, 6:09 AM IST
Horoscope Today : ఈ రోజు (మే 3) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రోజు మీకు విషాదాలు, నిరాశలు ఉండవు. రోజంతా అన్ని విధాలుగా నవ్వుతూ, సంతృప్తికరంగా గడపండి. ఈ రోజు లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. వ్యాపారరీత్యా కొన్ని ప్రణాళికలను రచిస్తారు. మీ సంబంధ బాంధవ్యాలు, మీ నెట్ వర్కింగ్ నైపుణ్యాల వల్ల లాభపడవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని, సంతోషాన్నీ కలిపి ఆనందించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు.
ఈ రోజు మీరు అందరినీ మీ మృదువైన మాటలతో, ముక్కుసూటి మనస్తత్వంతో ఆకట్టుకుంటారు. మీరు కోరుకున్న ఫలితాలు తెచ్చేందుకు ఈ గుణాలు సహాయపడుతాయి. ఇంటి భోజనమే తినండి. ఇలా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. పనీ బాగా చేయగలుగుతారు.
మీ మనసు ఈ రోజు చాలా సందిగ్ధంలో, అనిశ్చితిలో ఉంటుంది. మానసికంగా మీ భావాలు కూడా సముద్రంలోని అలల మాదిరిగా పోటెత్తుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి చర్చలు వద్దు. మీకు ప్రియమైన వారితో తగాదా పడవచ్చు. ప్రయాణాలు మానుకోండి.
మీరు మీ సోదరప్రేమ చూపించాల్సిన రోజు ఇదే. ఒంటరిగా ఉన్న మీ సోదరుడిని కలుసుకుంటే చాలా సంతోషిస్తాడు. మీరు అన్ని రకాల పరిచయాల నుంచీ లబ్ధి పొందుతారు. కాబట్టి స్నేహితులతోనూ, సన్నిహిత సంబంధీకులతోనూ గడపండి . మీరు సుందరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. మీరు ఆర్థికపరంగా కూడా మంచి స్థితి సంపాదిస్తారు.
ఇదొక మామూలు రోజు. మీ ప్రయత్నాలకు రావాల్సిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. ఆ ఫలితాలు మీరు ఆశించిన స్థాయిలో ఉండవు. అయినా మీరు నిరాశ చెందవద్దు. మీరు ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. అవన్నీ పక్కనపెట్టి కొంత సమయం మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. వారూ ఆనందిస్తారు. డబ్బును మితంగా ఖర్చు చేయండి.
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటారు. మీరు స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా సమయాన్ని గడపవచ్చు. ప్రయాణం అనుకూలం.
కోపం, పౌరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మీరు మాట్లాడకుండా ఉండండి. వ్యాపారంలోనూ మీకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర బంధువులతోనూ మీరు మీ సంబంధాలను చెడగొట్టుకుంటారు.
అద్భుతమైన రోజు ఇది. ఈ రోజు మీకు అనేక అవకాశాలు లభిస్తాయి, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనిని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. మీరు మీకు కావాల్సిన వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకుంటారు.
ఈ రోజు క్లైంట్లతో సమావేశాలతోనే మీ సమయం గడిచిపోతుంది. మీలోని గ్రహింపు శక్తితో మీరు మీకు ఇతరులు అందించే ప్రతిపాదనలు, అసెస్మెంట్లను చక్కగా అర్థం చేసుకుంటారు. దీని ప్రభావం తర్వాతి కాలంగా మీకు అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.
మీకు నచ్చిన వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు ఈ రోజు చాలా ఎక్కువున్నాయి. అతను/ఆమెకు మీరు భావాలు వ్యక్తం చేస్తారు. మీకు కుటుంబమంటే చాలా ప్రేమ. గడిచిన రెండేళ్ల కాలం కంటే ఈ రోజు మీరు ఆ ప్రేమను బాగా వ్యక్తపరుస్తారు. అదే సమయంలో మీరు దాన్ని తిరిగి అందుకుంటారు.
ఈ రోజు మీకై మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే మీకు కావాల్సిన సాంత్వన, ప్రశాంతత సమకూరదు. కలవరపెట్టే ఓ సంఘటన మిమ్మల్ని వాస్తవం వైపు మళ్లిస్తుంది.
గ్రహాలు అనుకూలం. కళారంగంలో వారికి అన్ని రకాల సహాయంగా ఉంటుందని అంటున్నాము. కొత్త పార్టనర్షిప్ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. మీ ప్రియమైన వారితో కలిసి పార్టీకి లేదా ఔటింగ్‌కు వెళ్లి రావచ్చు. మీరు మీ ఫ్యామిలీతో మీ బంధాన్ని దృఢపరుచుకుంటారు. విజయం మీకు గుర్తింపు తెస్తుంది.